పామును ముక్కులోంచి పంపి నోటి ద్వారా తీశాడు!
జంతువులు, పక్షులతో కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. కానీ ఓ వ్యక్తి ఏకంగా బతికున్న పామును
ఇంటర్నెట్ డెస్క్: జంతువులు, పక్షులతో కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా దర్శనమిస్తుంటాయి. కానీ, ఓ వ్యక్తి ఏకంగా బతికున్న పామును ముక్కులోంచి లోపలికి పంపి నోటి ద్వారా బయటికి తీస్తున్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. ఓ పెద్దాయన బతికున్న పామును తన చేతిలో పట్టుకొని కూర్చున్నాడు. కళ్లు మూసుకొని పామును తన ముక్కులోంచి లోపలికి పంపాడు. తర్వాత తన చేతిని నోటిలో పెట్టి ఆ పామును బయటికి తీశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మంది చూశారు. 8 వేల మంది కామెంట్ల ద్వారా తమ స్పందన తెలియజేశారు. కొందరు ఆ పెద్దాయన్ను అభినందిస్తుండగా.. వినోదం కోసం పాములను హింసించొద్దంటూ మరికొందరు మూగ జీవాలపై ప్రేమను వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
-
అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్‌నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!