Viral Video: ఇంటిపనుల్లో సాయం చేస్తున్న శునకం
కొన్ని రోజుల క్రితం మేరీ అనే యువతి తన పెంపుడు కుక్క ‘సీక్రెట్’తో కలిసి యోగా చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. తాజాగా ‘సీక్రెట్’కు సంబంధించిన మరో వీడియో నెటిజన్లను మెప్పిస్తోంది
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజుల క్రితం మేరీ అనే యువతి తన పెంపుడు కుక్క ‘సీక్రెట్’తో కలిసి యోగా చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. తాజాగా ‘సీక్రెట్’కు సంబంధించిన మరో వీడియో నెటిజన్లను మెప్పిస్తోంది. ఈ వీడియోలో శునకం తన యజమానికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ కనిపించింది . సీక్రెట్.. బట్టలు ఉతకడం, ఉతికిన బట్టలు సర్దడంలో తనకు సాయపడుతోన్న వీడియోను మేరీ ఇన్స్టాగ్రాం ద్వారా పంచుకోగా, అది కాస్తా వైరల్గా మారింది. కాగా ‘సీక్రెట్’ ఆస్ట్రేలియన్ షెఫెర్డ్ జాతికి చెందిన శునకం. మేరీ ఏ పని చెప్పినా బుద్ధిగా నేర్చుకుని చేసేస్తుంది. పెంపుడుకుక్కతో కలిసి చేసిన పనులను మేరీ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకుంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా