Viral Video : సముద్రంలో అనుకోని ఘటన.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు

కాలిఫోర్నియా గల్ఫ్‌లోని టోపోలోబాంపో బే ఆఫ్ అహోమ్‌లో బోటు ప్రయాణం కోసం సముద్రంలోకి వెళ్లిన పర్యాటకులకు ఒక భయానక అనుభవం ఎదురైంది. 66వేలపౌండ్ల బరువున్న తి

Published : 19 May 2022 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోటు ప్రయాణం కోసం సముద్రంలోకి వెళ్లిన పర్యటకులకు భయానక అనుభవం ఎదురైంది. 66 వేల పౌండ్ల బరువున్న ఓ భారీ తిమింగలం పర్యటకుల బోటుపై పడింది. దీంతో బోటులోని వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాలిఫోర్నియా గల్ఫ్‌లోని టోపోలోబాంపో బే ఆఫ్ అహోమ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బోటులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, పురుషులు గాయపడ్డారు.

టోపోలోబాంపో బే ఆఫ్ అహోమ్‌ ప్రాంతంలో తిమింగలాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అవి నిత్యం విన్యాసాలు చేస్తూ పర్యటకులను అలరిస్తుంటాయి. అయితే విన్యాసాలు సమయంలో తిమింగలం సమీపంలోకి అనుకోకుండా ఓ బోటు వెళ్లింది. ఈ క్రమంలో బోటుపై తిమింగలం పడి.. ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని