Viral news: అంతరిక్ష కేంద్రాన్ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?

మనం ఇంటిని శుభ్రం చేసుకున్నట్లే.. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు కూడా తమ వస్తువులను,నిద్రించే బ్లాకులను వారానికోసారి శుభ్రం చేసుకుంటారట. దీనికి సంబంధించిన ఓ వీడియోను యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Published : 26 Oct 2022 01:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో గాల్లో తేలియాడుతూ పని చేస్తుంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? భూమిపై ఉన్న వాతావరణానికి భిన్నమైన స్థితిలో, గురుత్వాకర్షణ లేకుండా అంతరిక్షకేంద్రంలో పని చేస్తుంటే ఆ అనుభూతే వేరు. నెలల తరబడి వ్యోమగాములు అక్కడే ఉంటూ రకరకాల పరిశోధనలు చేస్తుంటారు. భూమిపై మనం ఇల్లు శుభ్రం చేసుకున్నట్లే వారు కూడా తమ పడకగది, ఇతర వస్తువులను వారానికోసారి శుభ్రం చేసుకుంటారట. తమ చుట్టూ ఉన్న పరిసరాలను, స్పేస్‌స్టేషన్‌ భాగాలను ఎలా శుభ్రం చేసుకుంటారో చూపిస్తూ యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేసింది. ‘‘వ్యోమగాములు కూడా వారంతపు పనుల నుంచి తప్పించుకోలేరు. ప్రతి శనివారం ఉదయం స్పేస్‌ స్టేషన్‌లోని పరికరాలను పరిశుభ్రం చేయాల్సిందే’’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు. అసలు ఎలా శుభ్రం చేస్తారో మీరూ చూసేయండి మరి!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని