ఆక్వామెన్‌ బాడీ బిల్డింగ్‌

జాసన్‌మోమో... ఎవరో తెలుసా? ఈ పేరు తక్కువ మందికే తెలిసుంటుంది. మరి ‘ఆక్వామెన్‌’?... ఓ... ఎందుకు తెలీదు..! అతని ఫిట్‌నెస్‌... ముఖ్యంగా అతని బాడీ(చెస్ట్‌)...

Updated : 05 Jan 2019 00:24 IST

ఆక్వామెన్‌ బాడీ బిల్డింగ్‌

జాసన్‌మోమో... ఎవరో తెలుసా? ఈ పేరు తక్కువ మందికే తెలిసుంటుంది. మరి ‘ఆక్వామెన్‌’?... ఓ... ఎందుకు తెలీదు..! అతని ఫిట్‌నెస్‌... ముఖ్యంగా అతని బాడీ(చెస్ట్‌) చూసి ఫ్యాన్స్‌ అయిపోని ఫిట్‌నెస్‌ ఫ్రీకర్స్‌ ఉండరు. ఆక్వామెన్‌ బాడీ బిల్డింగ్‌జాసన్‌లా ఛాతి పెంచి విరుచుకు తిరగాలని తలంచని యువకుడుండడు. అంతటి ఆకర్షణీయమైన ఛాతిని సంపాదించడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. జాసన్‌ రోజూ ఉదయాన్నే ప్రణాళిక బద్ధంగా వ్యాయామం మొదలు పెట్టేవాడు. వార్మ్‌అప్‌, ఇతర ఎక్సర్‌సైజులు అయ్యాక... చెస్ట్‌ మీద దృష్టి పెట్టేవాడు. ప్రిస్సెంగ్‌ (ఇన్‌క్లేన్‌, డిక్లేన్‌, ఫ్లాట్‌) ఇలా సెట్స్‌గా విభజించి చేసేవాడు. ఫ్లాట్‌బెంచ్‌ డంబెల్స్‌ ఫ్లైయిస్‌, వెయిటెడ్‌ పుషప్స్‌, చెస్ట్‌పుల్‌ ఓవర్స్‌ క్రమం తప్పకుండా చేసేవాడు. రోజూ నాలుగు గంటల కఠోర శ్రమతో పాటు... తగిన పోషకాహారం తీసుకునేవాడు. మీలా దృఢమైన ఛాతి పెంచాలంటే ఏం చేయాలో చెప్పండని అభిమానులు అడిగితే... ‘ప్రతి ఒక్కరి బాడీ వేర్వేరు లక్షణాలతో, రూపాలతో ఉంటుంది. దానికి తగ్గట్టుగా నిపుణుల సలహా మేరకు వ్యాయామాలు చేయాల’ని వినయంగా చెప్పాడీ సముద్ర పుత్రుడు.

ఆక్వామెన్‌ బాడీ బిల్డింగ్‌

 

ఆక్వామెన్‌ బాడీ బిల్డింగ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు