బ్యాటరీ వెహికిల్‌.. యువత మెచ్చే స్టైల్‌!

307 కిలోమీటర్ల రేంజ్‌, తాకే తెరతో కూడిన కన్‌సోల్‌, హాలీవుడ్‌ సినిమాలో లాగా స్టైలిష్‌ రూపం.. యువతని ఆకట్టుకోవడానికి ఒక బ్యాటరీ బండికి ఇంతకన్నా ఏం కావాలి? ఇలాంటి ఫీచర్లతో వస్తోంది ‘అల్ట్రావయోలెట్‌ ఎఫ్‌77’. అక్టోబరు 23 నుంచి బుకింగ్స్‌ మొదలవుతున్నాయి.

Published : 22 Oct 2022 00:10 IST

307 కిలోమీటర్ల రేంజ్‌, తాకే తెరతో కూడిన కన్‌సోల్‌, హాలీవుడ్‌ సినిమాలో లాగా స్టైలిష్‌ రూపం.. యువతని ఆకట్టుకోవడానికి ఒక బ్యాటరీ బండికి ఇంతకన్నా ఏం కావాలి? ఇలాంటి ఫీచర్లతో వస్తోంది ‘అల్ట్రావయోలెట్‌ ఎఫ్‌77’. అక్టోబరు 23 నుంచి బుకింగ్స్‌ మొదలవుతున్నాయి.
* ఇది లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీతో పని చేస్తుంది. 10.5కిలోవాట్ల రిమూవబుల్‌ బ్యాటరీ ప్యాక్‌తో దూసుకెళ్తుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద బ్యాటరీ ద్విచక్రవాహనం.
* ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 307 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఐదు గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ అవుతుంది. బ్యాటరీ వేడిని చల్లార్చేందుకు ఎయిర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ని అమర్చారు. ఎకో, స్పోర్ట్‌, ఇన్‌సేన్‌ అనే మూడు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి.
* అ్యధిక వేగం గంటకు డెబ్భై కిలోమీటర్లు. ఆ స్పీడ్‌ మూడు సెకన్లలో అందుకుంటుంది. ఇది టీవీఎస్‌ కంపెనీ అనుబంధ సంస్థ. సింగిల్‌పాడ్‌ హెడ్‌లైట్‌, ఫైబర్‌ కవర్లు, స్ప్లిట్‌ సీటు, దృఢమైన స్టీల్‌ ట్రెలిస్‌ ఫ్రేమ్‌.. ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి.   

* ధర రూ.3.25లక్షలు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని