నయా నింజా

కావాసాకి ద్విచక్ర వాహన కంపెనీ అనగానే గుర్తొచ్చేవి ‘నింజా’ మోడళ్లు. ఈ జపాన్‌ సంస్థ మేటి డిజైన్‌ రూపొందించి... యువతలో ఆసక్తితోపాటు అమ్మకాలను పెంచుకుంది ఈ శ్రేణితోనే. బాగా పాపులరైన ‘నింజా 300’ మోడల్‌కి మరిన్ని..

Published : 23 Apr 2022 01:33 IST

కావాసాకి ద్విచక్ర వాహన కంపెనీ అనగానే గుర్తొచ్చేవి ‘నింజా’ మోడళ్లు. ఈ జపాన్‌ సంస్థ మేటి డిజైన్‌ రూపొందించి... యువతలో ఆసక్తితోపాటు అమ్మకాలను పెంచుకుంది ఈ శ్రేణితోనే. బాగా పాపులరైన ‘నింజా 300’ మోడల్‌కి మరిన్ని హంగులు అద్ది కొత్తగా విపణిలోకి తీసుకొస్తామని ప్రకటించింది కావాసాకీ. ‘సిద్ధంగా ఉండండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించి ఒక టీజర్‌ కూడా విడుదల చేసింది. ఇంజిన్, సాంకేతిక అంశాల పరంగా ఎలాంటి మార్పులు లేవు. రంగులు, గ్రాఫిక్స్, భద్రతా ఫీచర్లులాంటి విషయాల్లోనే మరింత ఆకర్షణలు ఉంటాయని అందులో తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని