అపార్థాలకు బలయ్యా.. ఒంటరిగా మిగిలిపోయా..!
ఆఫీసులో పని ముగించి ఇంటికొస్తున్నా. మా వీధి సమీపిస్తుంటే ‘రేయ్.. రాజ్ అంటే నువ్వేనా?’ అనే అరుపు. వెనుదిరిగి చూసేలోపే ఆ వ్యక్తి నా దగ్గరికొచ్చి బూతులు తిడుతూ కొట్టినంత పని చేశాడు.. బెదిరించాడు. అయోమయంగా అటూఇటూ చూస్తే కొద్దిదూరంలో శ్రీలత (పేరు మార్చాం). ‘సీన్’ నాకర్థమైంది. ‘నా తప్పేమైనా ఉంటే క్షమించండి’ అని అతడికి సారీ చెప్పి కదిలా.
నాలుగేళ్ల క్రితం. ఓ పోటీ పరీక్షలో నా మనసు మీటింది తను. పొడవాటి రింగుల జుట్టు, కలువల్లాంటి పెద్ద కళ్లతో ఉన్న తనని చూస్తూ పరీక్ష రాయడమే మరిచిపోయా. ‘హలో.. కొంచెం జవాబులు చెప్పరా ప్లీజ్..’ అన్నట్టుగా కళ్లతోనే సైగలు చేయడంతో ఈ లోకంలోకి వచ్చా. మొహాన్ని వెయ్యివాట్ల బల్బులా మార్చి ఆన్సర్‌షీట్ అందించా. ‘చాలా థాంక్స్.. నేను శ్రీలత’ అంటూ బయట కనిపించి, చేయి ఊపుతూ తుర్రుమంది. వెళ్తూవెళ్తూ వెనక్కి తిరిగి చూసిన ఒక ఓరచూపుతో నా గుండె గల్లంతైంది. అప్పట్నుంచి ఏ అమ్మాయిని చూసినా ఆ చారడేసి కళ్లే గుర్తొచ్చేవి. అంతగా నన్ను మాయ చేసి మాయమైన తను ఏడాదిన్నర తర్వాత నా ముందు ప్రత్యక్షమైంది. అదీ కొలీగ్‌గా. మాటలు కలిశాయి. నెంబర్లు తర్జుమా అయ్యాయి. తన నుంచి మెసేజ్ వస్తే ఓ కిక్. మాటతో పరవశం. ఆ కొంటెచూపులైతే మత్తెక్కించేవి.
మంచి ఆఫర్ రావడంతో కొన్నాళ్లకి ఉద్యోగం మారా. ఫోన్లే మా మధ్య రాయబారం నడిపేవి. ఎప్పట్లాగే ఓసారి కాల్ చేశా. ‘నన్నొదిలి అంతదూరం ఎందుకు వెళ్లిపోయావురా..? నువ్వు నాలైఫ్‌లో సమ్‌థింగ్ స్పెషల్’ అంది. ఆ క్షణంలో నాలో కలిగిన భావనలు వర్ణించడానికి మాటల్లేవు. అప్పుడే తను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది. ‘నన్ను మా అమ్మలా చూసుకుంటావా?’ అంటూ గోముగా అడిగింది. ‘ఒరేయ్ పిచ్చిమొద్దూ.. నీ చిటికెన వేలు పట్టుకొని నడవడానికి సిద్ధం’ అని ఊరిస్తున్నట్టు అనిపించాయి ఆ మాటలు.
ప్రేమ, జీవితం సాఫీగా సాగుతున్నాయి. తన బాగోగులుఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటుండేవాణ్ని. దాన్ని తను తప్పుగా అర్థం చేసుకుందో.. లేక వాడే లేనిపోనివి కల్పించి చెప్పాడో.. ‘నా గురించి తెలుసుకోవాలంటే నన్నే అడగాలిగానీ ఇతరుల ద్వారా వాకబు చేస్తావా?’ అందోసారి. నాకు షాక్. క్షేమ సమాచారం కోసం అలా చేశానన్నా వినదే! ఫోన్ చేస్తే కట్ చేసేది. మెసేజ్‌కి జవాబివ్వదు. నేనూ విసిగిపోయి బెట్టు చేశా. తనపై కోపంతో మాట్లాడ్డం తగ్గించానేగానీ.. నా గుండెలో తన స్థానం అలాగే ఉండేది.
ఓరోజు తను ఉద్యోగం మానేసి వెళ్లిపోతోందనే విషయం తెలిసింది. అంటే తనిక మళ్లీ కనబడదు. ఆ క్షణం నా అహం కరిగి కన్నీరైంది. వెంటనే ఫోన్ చేశా. తీయలేదు. తర్వాత తనే చేసింది. నేనూ లిఫ్ట్ చేయలేకపోయా. అచ్చం ఖుషీ సినిమాలో క్లైమాక్స్‌లా. ఇలా కాదనుకొని నేరుగా వెళ్లి క్షమించమని అడుగుదామనుకున్నా. కానీ అప్పటికే ఆలస్యమైంది. నాపై అపనమ్మకం, అపార్థాలతో తను వేరొకరికి సన్నిహితమైందని తెలిసింది. రూఢీ చేసుకోవడానికి ఫ్రెండ్‌కి ఫోన్ చేశా. ‘దగ్గరవడం కాదురా.. వాళ్లిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. యూ ఆర్ టూ లేట్’ అన్నాడు. చెమ్మగిల్లిన కళ్లతో ఎందుకిలా చేశావని అడిగా. ‘ఉద్యోగంలో ఆప్షన్లు ఉన్నట్టుగానే భాగస్వామి విషయంలోనూ ఉంటాయి రాజ్. నీకన్నా తనే నాకు కరెక్ట్ అనిపిస్తోంది’ అంటుంటే తట్టుకోలేకపోయా. నాలో ఆశలు రేపి.. తీపి జ్ఞాపకాలు పంచి.. ఇలా గుండెకు మానని గాయం చేస్తుందని అస్సలు అనుకోలేదు. చేసేదేం లేక తన జీవితం నుంచి తప్పుకోవాలనుకున్నా. అయినా.. భవిష్యత్తులో ఏవైనా ఆటంకాలు కల్పిస్తానని భావించిందేమో! ఇలా దారి కాచి కట్టుకోబోయేవాడితో బెదిరించింది. తనెప్పుడూ అంతే.. నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంది. ఇంక చాలు! నేను నీ దారికి, నీ సంతోషానికి అడ్డురాను. నీ భవిష్యత్తు అయినా అపార్థాలతో అల్లకల్లోలం కావొద్దని కోరుకుంటున్నా.
- రాజ్
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
-
World News
Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
-
Sports News
IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌పై రికీ పాంటింగ్ జోస్యం
-
Politics News
Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పిన రేవంత్‌రెడ్డి
-
India News
India Corona : 16 వేల దిగువకు కొత్త కేసులు..
-
Ap-top-news News
Andhra News: కొత్త పోస్టుని సృష్టించి.. కాటమనేని భాస్కర్ మళ్లీ బదిలీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!