ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి నిరసన సెగ

తమపై పెట్టిన కేసులు ఎత్తివేస్తేనే గ్రామంలోకి రావాలంటూ చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పాతకాల్వ గ్రామస్థులు వైకాపా ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని

Updated : 29 Nov 2021 06:42 IST

కేసులు ఎత్తివేస్తేనే గ్రామంలోకి రండి

పాతకాల్వ గ్రామస్థుల డిమాండు

మోహిత్‌రెడ్డితో వాగ్వాదానికి దిగిన పాతకాల్వ గ్రామస్థులు

తిరుపతి గ్రామీణ, న్యూస్‌టుడే: తమపై పెట్టిన కేసులు ఎత్తివేస్తేనే గ్రామంలోకి రావాలంటూ చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పాతకాల్వ గ్రామస్థులు వైకాపా ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని అడ్డుకున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం సరఫరా చేసిన నిత్యావసర సరకులు అందజేయడానికి మోహిత్‌రెడ్డి ఆదివారం గ్రామానికి వచ్చారు. గ్రామస్థులు ఏకమై.. ‘పేరూరు చెరువుకు గండికొట్టి ఆ నీళ్లు మా గ్రామాన్ని ముంచేసినప్పుడు మేం కనపడలేదా? చెరువు నీళ్లు మా ఊరి మీదకు వదలొద్దని ధర్నాకు దిగితే.. మొదట గండికొట్టబోమని చెప్పి వెళ్లిపోయారు. మరుసటి రోజే గండి కొట్టారు. దీనిపై మేం జాతీయ రహదారిపై ధర్నాకు దిగితే మమ్మల్నే కొట్టి, మా మహిళలను గాయపరిచి.. మాపైనే కేసులు పెడతారా? ఇదేం న్యాయమ’ంటూ ఆగ్రహించారు. అధికారులు కేసులు పెట్టారని, మేం ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని మోహిత్‌రెడ్డి చెప్పినా విన్లేదు. నిరసన కొనసాగించడంతో పోలీసులు ఆయనను సచివాలయంలోకి తీసుకెళ్లి రక్షణ కల్పించారు. అనంతరం అధికారుల తరఫున క్షమాపణ కోరుతున్నానని మోహిత్‌రెడ్డి చెప్పారు. తర్వాత పోలీసులు అక్కడినుంచి ఆయనను పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని