icon icon icon
icon icon icon

Andhra news: వైకాపా ప్రలోభాల పర్వం.. మంగళగిరిలో రూ.25కోట్లు సీజ్‌

పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.

Published : 10 May 2024 15:35 IST

మంగళగిరి: పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడిలో సుమారు రూ.25 కోట్ల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. 

తిరువూరులో రూ.31లక్షలు..

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో వైకాపా నాయకుడు దారా శ్రీనివాసరావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన రూ.31లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు 18వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ నీలిమ భర్త శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు ఏసీపీ ప్రకాశ్‌బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img