icon icon icon
icon icon icon

EC: పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు

పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Published : 10 May 2024 15:40 IST

అమరావతి: పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. పోలింగ్‌ తేదీ రోజు ప్రిసైడింగ్‌ అధికారికి పోలింగ్‌ ఏజెంట్లు తమ వివరాలు సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. ఏజెంట్లను అభ్యర్థి సర్టిఫై చేయాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రిసైడింగ్‌ అధికారి సమక్షంలో పోలింగ్‌ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని ఈసీ స్పష్టత ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img