కరాటే క్రీడాకారుడు కార్తీక్‌రెడ్డికి రూ.10 లక్షల ప్రోత్సాహకం

కరాటేను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) క్రీడగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. తిరుపతికి చెందిన అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు అరబండి కార్తీక్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రిని

Published : 23 Sep 2022 04:08 IST

ఈనాడు, అమరావతి: కరాటేను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) క్రీడగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. తిరుపతికి చెందిన అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు అరబండి కార్తీక్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఇటీవల కామన్వెల్త్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్‌రెడ్డి స్వర్ణ పతక విజేతగా నిలిచారు. అంతకుముందు ఏప్రిల్‌లో యూఎస్‌ కరాటే ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణపతకాన్ని గెలుచుకుని, వరుసగా రెండు స్వర్ణాలు సాధించిన భారత కరాటే క్రీడాకారుడిగా కార్తీక్‌ రికార్డు సృష్టించారు. సీఎంను కలిసిన కార్తీక్‌ తాను సాధించిన పతకాలను ఆయనకు చూపించారు. టర్కీలో జరగనున్న ప్రపంచ కరాటే ఛాంపియన్‌షిప్‌లోనూ పతకం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వ సహకారం కావాలని కోరగా... సీఎం రూ.10 లక్షల నజరానాను ప్రకటించారు. రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజా, కార్తీక్‌ తల్లిదండ్రులు శిరీషారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ఎస్‌కేడీఏఏపీ అధ్యక్షుడు మిల్టన్‌ లూథర్‌శాస్త్రి తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని