‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను నిలిపివేయాలి’

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేష్‌ల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు సామాజిక న్యాయ కేంద్రం కన్వీనర్‌ వై.కోటేశ్వరరావు (వైకే) డిమాండు చేశారు.

Published : 28 Nov 2022 03:25 IST

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేష్‌ల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు సామాజిక న్యాయ కేంద్రం కన్వీనర్‌ వై.కోటేశ్వరరావు (వైకే) డిమాండు చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు కొలీజియం అకస్మాత్తుగా, అకారణంగా చేసిన బదిలీలు.. న్యాయవాదులు, కక్షిదారులను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని తెలిపారు. ఇవి సాధారణ పద్ధతిలో, పరిపాలనాపరమైన అవసరాల నిమిత్తంగా చేసినవిగా అర్థం చేసుకోలేమని పేర్కొన్నారు. సీనియర్‌ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని గమనంలోకి తీసుకుని న్యాయమూర్తులు జస్టిస్‌ దేవానంద్‌, జస్టిస్‌ రమేష్‌లు ఇచ్చిన తీర్పులు ప్రజల నమ్మకాన్ని, గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో సంస్థ సభ్యులు జైభీమారావు, సైకం రాజశేఖర్‌, చింతా నాగసుమంత్‌, పృధ్వీరాజ్‌, కార్తిక్‌, జి.కోటినాగులు, ఎం.చలపతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని