ఏడాదిలో రూ.6 లక్షలతో ఇడ్లీల కొనుగోలు
నగరానికి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో ఇడ్లీల కోసం ఏకంగా రూ.6 లక్షలు ఖర్చు చేశారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఆయన ఒక్కరే 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారు.
స్విగ్గీలో 8,428 ప్లేట్లు ఆర్డర్ చేసిన హైదరాబాద్ వాసి
ఈనాడు, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో ఇడ్లీల కోసం ఏకంగా రూ.6 లక్షలు ఖర్చు చేశారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఆయన ఒక్కరే 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారు. గురువారం (మార్చి 30) ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని’ పురస్కరించుకుని స్విగ్గీ ఈ అల్పాహార వంటకంపై తన వార్షిక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. గత మార్చి 30 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసింది. ఇడ్లీలను ఆరగించడంలో బెంగళూరు వాసులు ముందున్నారని, ఆ తరువాత హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోయంబత్తూరు నగరాల్లో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. హైదరాబాద్ వాసులు కారంపొడి నెయ్యి ఇడ్లీ ఎక్కువగా తింటున్నారని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు