ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం

‘ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి.

Published : 05 May 2024 06:52 IST

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి
‘ఈనాడు- ఈటీవీ’తో అమెరికాలో  న్యూరాలజిస్ట్‌ తేజానంద్‌ గౌతమ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. రాష్ట్రం ఎంతో కాలంగా అన్నపూర్ణగా పేరుగాంచింది. అన్నం పెట్టే రైతును కాపాడుకోవాలి. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నేను కూడా సాధారణ రైతు కుటుంబం నుంచే వచ్చాను’ అని అమెరికాలో న్యూరాలజిస్ట్‌గా ఉన్న గుంటూరు వాసి డాక్టర్‌ తేజానంద్‌ గౌతమ్‌ మూల్పూరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చేసే వారిని, ఉపాధి కల్పించే వారినే ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తేజానంద్‌ వైద్య విద్య చదువుకుని 40 ఏళ్ల కిందటే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం స్వగ్రామానికి వచ్చిన ఆయన ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో ‘ఈటీవీ- ఈనాడు’తో మాట్లాడారు.

  • అమెరికాలో కూడా ప్రస్తుతం ఎన్నికల వాతావరణ ఉంది. జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎవరైతే అభివృద్ధిపై దృష్టి సారిస్తారో, యువతను సమర్థంగా వినియోగించుకుంటూ ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తారో అలాంటి వారిని ఎన్నుకోవడానికే అమెరికా ప్రజలు మొగ్గు చూపుతారు. ఇక్కడ కూడా అలాగే ఆలోచించాలి. అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. యువతకు ఉద్యోగాలు ముఖ్యం.
  • ఒక దేశానికి, రాష్ట్రానికి రాజధాని ముఖ్యం. అమెరికాలో ఒకే రాజధాని ఉంది. రాష్ట్రంలోనూ ఒకే రాజధాని ఉండాలి. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒకటే రాజధాని ఉంటే అందరికీ అవసరమైన పనులు ఒకేచోట, ఒకేసారి పూర్తి చేసుకోవడానికి వీలుంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని