జిల్లాల వారీగా సీఎఫ్‌డీ ఎన్నికల పరిశీలకులు

ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్‌డీ ఛైర్మన్‌ జస్టిస్‌ భవానీప్రసాద్‌ తెలిపారు.

Published : 05 May 2024 06:41 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్‌డీ ఛైర్మన్‌ జస్టిస్‌ భవానీప్రసాద్‌ తెలిపారు. ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో కలిసి శనివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అనంతపురానికి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌, కర్నూలుకు కేరళ కేడర్‌ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డబ్ల్యూఆర్‌ రెడ్డి, చిత్తూరుకు ఆదాయ పన్ను శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ పి.రఘు, నెల్లూరుకు కర్నూలు పూర్వ కలెక్టర్‌ రామశంకర్‌నాయక్‌, ప్రకాశానికి మానవ వనరుల సంస్థ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ చక్రపాణి, గుంటూరుకు కాఫీ బోర్డు మాజీ ఛైర్మన్‌ జీవీ కృష్ణారావు, కృష్ణా జిల్లాకు తెలంగాణ పూర్వ సీఎస్‌ రాజీవ్‌శర్మతో పాటు మంగోలియా మాజీ రాయబారి సురేశ్‌బాబు, పశ్చిమగోదావరికి విశ్రాంత జడ్జి ఎ.లక్ష్మి, తూర్పుగోదావరికి విశ్రాంత ఐఏఎస్‌ స్కందకుమార్‌కృష్ణన్‌, విశాఖకు హరియాణా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ డా. దిలీప్‌సింగ్‌, విజయనగరానికి విశ్రాంత ఐఏఎస్‌ అజయ్‌మిశ్రా, శ్రీకాకుళానికి భారత ప్రభుత్వ పూర్వ ప్రత్యేక కార్యదర్శి వెంకటరమణ, కడపకు జాతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ సంతోష్‌ మెహ్రా, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డిలను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని