1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 May 2024 07:46 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం నిలిచేలా గత ప్రభుత్వంలో తెదేపా అధినేత చంద్రబాబు అమరావతికి శ్రీకారం చుడితే.. ఆయనపై పగతో జగన్‌ విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమం 1600రోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం రాజధాని గ్రామాల్లో అన్నదాతలు ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని