ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 05 May 2024 06:45 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సూచనల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. సెక్రెటేరియట్‌ విభాగాలు, విభాగ అధిపతులు, జిల్లా కలెక్టర్లు ఇందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.


రాష్ట్రంలో 6న ఐసెట్‌

అనంతపురం (ఎస్కేయూ), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్‌-2024ను ఈ నెల 6న నిర్వహిస్తున్నట్లు సెట్‌ ఛైర్మన్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకుపతి(వీసీ) హుస్సేన్‌రెడ్డి తెలిపారు. వర్సిటీలోని తన ఛాంబర్‌లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏపీలో 111, తెలంగాణలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్ష ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని పేర్కొన్నారు.


ఎన్నికల విధుల వల్ల ఏ ఉద్యోగీ ఓటు కోల్పోకూడదు
ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగుల సంఘం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల విధుల కారణంగా ఏ ఉద్యోగీ తన ఓటు హక్కును కోల్పోకూడదని, విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికీ¨ పోస్టల్‌ బ్యాలట్‌ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు అన్నారు. నియోజకవర్గాల వారీగా ఎంతమంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారో స్పష్టమైన సమాచారం లేదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఏప్రిల్‌ 30న ఎన్నికల విధుల్లోకి తీసుకున్న అంగన్‌వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ అందేలా ఈసీ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే గడువు పెంచాలి’ అని ఈసీని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని