గరుడ వాహనంపై ఊరేగిన శ్రీవారు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదో రోజు శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 23 Sep 2023 06:40 IST

తరించిన భక్త జనం

ఈనాడు, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదో రోజు శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఏడు గంటలకు వాహన మండపం నుంచి ప్రారంభమైన వాహన సేవ   అర్ధరాత్రి వరకు సాగింది.  బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు. మాడ వీధులన్నీ గోవింద నామ స్మరణతో మార్మోగాయి. ఉదయం శ్రీమలయప్పస్వామి మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడిగా అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం నుంచే భక్తుల ఎదురుచూపులు

గరుడ వాహనంపై విహరించే శ్రీమలయప్పస్వామిని తిలకించేందుకు ఉదయం నుంచే భక్తులు గ్యాలరీల్లోకి వచ్చారు. అవి నిండిపోవడంతో పలువురు భక్తులు క్యూలైన్లలోనే నిలిచిపోయారు. మాడ వీధుల్లో హారతి పాయింట్ల నుంచి, ఇతర ఏర్పాట్ల ద్వారా వారు వాహన సేవను వీక్షించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని