Dharmana: రోడ్లేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా?: మంత్రి ధర్మాన

రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సోమవారం జరిగిన సామాజిక సాధికార యాత్రలో ధర్మాన మాట్లాడుతూ... ‘రోడ్లు బాగాలేవని వైకాపాను వద్దనుకోవద్దు.

Updated : 21 Nov 2023 08:40 IST
ఈనాడు- అనకాపల్లి, న్యూస్‌టుడే- అచ్యుతాపురం: రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సోమవారం జరిగిన సామాజిక సాధికార యాత్రలో ధర్మాన మాట్లాడుతూ... ‘రోడ్లు బాగాలేవని వైకాపాను వద్దనుకోవద్దు. జగన్‌ చేసిన పనికిమాలిన పనులేమిటో తెదేపా నాయకులు చెప్పలేకపోతున్నారు. రాష్ట్రానికి చెన్నై, కర్నూలు రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఆయా చోట్లకు వెళ్లేందుకు రెండు రోజులు పట్టేది. విశాఖ కంటే అన్ని అర్హతలూ ఉన్న రాజధాని ఏపీలో లేదు. రాజధాని వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి’ అని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, ఏపీ కంటే తక్కువ ధరలు ఉన్న రాష్ట్రమేదో చెప్పాలన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని