‘నేనూ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు బాధితుడినే’

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది.

Published : 09 May 2024 04:03 IST

చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే  రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే!
రద్దు చేయాలంటూ రైతు వేడుకోలు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ‘వైకాపా ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి నేనే బాధితుడిని’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘దుర్గాడలో నాకు వారసత్వంగా లభించిన 50 సెంట్ల భూమి ఉంది. పట్టాదారు పాసు పుస్తకమూ ఉంది. వైకాపా ప్రభుత్వంలో రీ సర్వే చేసి కేవలం 35 సెంట్ల భూమే ఉందని కొత్త పట్టా పుస్తకం ఇచ్చారు. విస్తీర్ణం తప్పుగా నమోదైందని, సరిచేయాలని స్పందన కార్యక్రమంలో 11 సార్లు దరఖాస్తులు చేశా. భూమి సర్వే కోసం 6 దఫాలు చలానా చెల్లించా. ఒకసారి అధికారులు సర్వేకు వచ్చారు. పక్కనున్న రైతులతో వివాదాలేవీ లేకున్నా సరిహద్దు గొడవలున్నట్లు తప్పుడు నివేదిక ఇచ్చారు. జిల్లా సర్వే అధికారులు 2 దఫాలు సర్వే చేసి.. గ్రామస్థాయి సర్వేయరు నివేదికనే సమర్ధించారు. ఆ సర్వే నివేదికను మాత్రం తనకు ఇవ్వడం లేదు. ఇంతవరకూ భూ విస్తీర్ణం వివరాలు సరిచేయలేదు. రెండేళ్లకు పైగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా’ అని గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే సామాన్య రైతులు వివాదాల్లో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని, రద్దుచేయాలని గంగాధర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని