పాలిసెట్‌లో 87.61% మంది అర్హత

ఏపీ పాలిసెట్‌లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్‌ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం 

Published : 09 May 2024 04:07 IST

బాలికలు 89.81%, బాలురు 86.16% మంది విజయం
ఫలితాలను విడుదల చేసిన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి

ఈనాడు, అమరావతి: ఏపీ పాలిసెట్‌లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్‌ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం  సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, సంయుక్త సంచాలకులు పద్మారావుతో కలిసి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అత్యధికంగా అర్హత సాధించారు. ప్రవేశ పరీక్షకు 56,464మంది బాలికలు హాజరు కాగా.. 50,710 (89.81%)మంది అర్హత సాధించారు. బాలురు 85,561మంది పరీక్ష రాయగా.. 73,720 (86.16%) అర్హత పొందారు. ఆరుగురు విద్యార్థులు 120 మార్కులకు గాను 120 సాధించారు. విశాఖపట్నం జిల్లా నుంచి అత్యధికంగా 87.17%, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 70.46% మంది అర్హత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈసారి అర్హుల సంఖ్య పెరిగింది. 2023లో 86.35శాతం కాగా.. ఈసారి 87.61శాతం మంది అర్హత పొందారు.

అన్నింటిలో 82వేల సీట్లు

రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కలిపి మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 87ప్రభుత్వ, ఒక ఎయిడెడ్‌లో కలిపి 18,141 సీట్లు ఉండగా.. ప్రైవేటులో 179 కళాశాలల్లో 64,729 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

  • 32 బ్రాంచిల్లో రెండు, మూడేళ్లు, మూడున్నరేళ్లు కోర్సులను అందిస్తున్నారు.
  • ప్రవేశాలకు నిర్వహించే వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. వీటిని సాంకేతిక విద్య, శిక్షణ మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
  • వెబ్‌ కౌన్సెలింగ్‌ను పూర్తి చేసి, జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు కమిషనర్‌ నాగరాణి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని