Prakasam: రాష్ట్ర సారథీ.. ఇదా వారధి!

ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దేశిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో సాగర్‌ కాలువపై నిర్మించిన వంతెన 2022 ఫిబ్రవరి 27న కూలిపోయింది.

Updated : 22 Jan 2024 09:34 IST

ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దేశిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో సాగర్‌ కాలువపై నిర్మించిన వంతెన 2022 ఫిబ్రవరి 27న కూలిపోయింది. అప్పటి నుంచి స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. చందవరం, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 2500 మంది ప్రజలు, సుమారు 3 వేల పశువులు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించిన సాగుభూమి కాలువకు అవతలివైపు ఉంది. పశువులకు మేత కావాలంటే అటువైపే వెళ్లాల్సిన పరిస్థితి. రైతులు కొన్ని రోజులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక వంతెన నుంచి వెళ్లేవారు. ఆ మార్గంలో పశువులను తోలుకొని వెళ్లడానికి ఎక్కువ సమయంతో పడుతుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో కూలిన వంతెనపైనే కర్రలు ఆసరాగా ఏర్పాటు చేసుకొని ఇలా రాకపోకలు సాగిస్తున్నారు. పశువులు జారిపడి కాళ్లు విరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వారం క్రితం పశువుల కాపరి నీటిలో పడిపోయారు. ప్రస్తుతం కాలువలో నీరు తక్కువగా ఉన్నందున కూలిన వంతెన పైనుంచి పారడం లేదు. ఎక్కువగా వచ్చినపుడు ఇటు వెళ్లలేరు. దీనిపై ఎన్నెస్పీ ఏఈ కేశవరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. వంతెన పునర్నిర్మాణానికి రూ.1.70 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామని చెప్పారు.

న్యూస్‌టుడే, దొనకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు