ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి

‘హైదరాబాద్‌ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి.

Published : 07 May 2024 04:40 IST

ప్రవాస భారతీయుడు మల్లవరపు సుందర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘హైదరాబాద్‌ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రమూ అభివృద్ధి చెందుతుంది. అందుకే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి’ అని ప్రవాస భారతీయుడు మల్లవరపు సుందర్‌ సూచించారు. గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన సుందర్‌ 2012లో లండన్‌ వెళ్లి, కొన్నేళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. తర్వాత సొంతంగా ఉద్యోగ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే యువతకు గైడెన్స్‌ అందిస్తున్నారు. సోమవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మంగళగిరిలో మాట్లాడారు.

ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు..

‘యువతకు నైపుణ్యం, మౌలిక వసతులు కల్పిస్తే పెట్టుబడులు వస్తాయి. పారిశ్రామికవేత్తలు కూడా అలాంటి ప్రాంతాలు చూసే పెట్టుబడులు పెడతారు. కియా పరిశ్రమను స్థాపించినప్పుడు చాలా మందికి నైపుణ్యశిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు వారు వివిధ స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గతంలో మంచి మార్గదర్శకం చూపించే నాయకులు ఉండటం వల్లే ఈ రోజు విదేశాల్లో ఉన్నతంగా బతకగలుగుతున్నాం. ఓటేయడం ద్వారానే అలాంటి నాయకులని ఎన్నుకోవచ్చు. ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి. ఓటు విలువ తెలిసే విదేశాల నుంచి వచ్చాం’ అని సుందర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని