దేశీయ విమాన ప్రయాణికుల ఆగస్టులో 66 లక్షలు: ఇక్రా

ఆగస్టులో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 66 లక్షలుగా నమోదైందని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. జులైలో ప్రయాణించిన 51 లక్షల మందితో పోలిస్తే, ఇది 31 శాతం ఎక్కువ. 2020 ఆగస్టులో ప్రయాణించిన 28.3 లక్షల మందితో పోలిస్తే..

Published : 07 Sep 2021 02:03 IST

దిల్లీ: ఆగస్టులో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 66 లక్షలుగా నమోదైందని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. జులైలో ప్రయాణించిన 51 లక్షల మందితో పోలిస్తే, ఇది 31 శాతం ఎక్కువ. 2020 ఆగస్టులో ప్రయాణించిన 28.3 లక్షల మందితో పోలిస్తే..ఈ సంఖ్య 131 శాతం పెరిగింది. అధిక విమాన సర్వీసుల పునరుద్ధరణ, కొవిడ్‌-19 తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. అవసరమైతే తప్పించి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉందని విశ్లేషించింది. 2020 ఆగస్టులో సుమారు 28,334 విమాన సర్వీసులు నడవగా, 2021 ఆగస్టులో అది 99 శాతం పెరిగి 57,500కు చేరింది. 2021 జులైతో పోల్చినా ఇది 22 శాతం అధికమని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ఒక్కో విమానం ద్వారా సగటున 114 మంది ప్రయాణించగా... జులైలో ఈ సంఖ్య 106గా ఉందని ఇక్రా పేర్కొంది.


హోండా మోటార్‌ సైకిల్‌ వర్చువల్‌ షోరూమ్‌

ముంబయి: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ దేశీయంగా తమ తొలి బిగ్‌వింగ్‌ వర్చువల్‌ షోరూమ్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో 360 డిగ్రీల్లో వాహనాన్ని పరిశీలించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వివరాల భర్తీ, నేరుగా ఇంటికే సరఫరా పొందే వీలు, చాట్‌ సపోర్ట్‌ వంటి సౌకర్యాలు ఇందులో కల్పించారు. వినియోగదార్లు ఉన్న ప్రాంతం ఆధారంగా డీలర్లను ఎంచుకోవచ్చని హోండా మోటార్‌సైకిల్‌ ఇండియా డైరెక్టర్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు