విదేశాల్లో ఉండేవారికి ప్ర‌వాసాంధ్ర భ‌రోసా ప‌థ‌కం

ఆప‌ద స‌మ‌యంలో ప్ర‌వాసాంధ్రుల‌కు ఆత్మ‌బంధువు ఏపీఎన్ఆర్‌టీ బీమా ప‌థ‌కం.

Published : 26 Dec 2020 13:08 IST

విదేశాల్లో ఉపాధి లేదా విద్యాభ్యాసం చేస్తున్న ప్ర‌వాసాంధ్రుల‌కు క‌ష్ట‌స‌మ‌యాల్లో ఆస‌రాగా ఉండే విధంగా సంక్షేమ‌ బీమా ప‌థ‌కాన్ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న ప్ర‌వాసాంధ్రుల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్ర‌వాసాంధ్ర భ‌రోసా బీమా ప‌థ‌కాన్ని 2018 జ‌న‌వ‌రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఏపీఎన్ఆర్‌టీ కింద ప్ర‌వాసాంధ్ర భ‌రోసా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.

ఎవ‌రు తీసుకోవ‌చ్చు?

  • విదేశాల్లో ఉండే వారికి ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణం లేదా అంగ‌వైక‌ల్యం సంభవించినా,

  • విదేశాల్లో చ‌దువున్న లేదా ప‌నిచేస్తున్న వారు జ‌బ్బుప‌డి ఆసుప‌త్రి పాలైనా,

  • విదేశాల్లో ఉండ‌గా ప్ర‌సూతి సంబంధించిన ఖ‌ర్చుల‌కు,

  • విదేశాల్లో ఉపాధి లేదా విద్య‌కు సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య త‌లెత్తి వ్య‌య‌భారం మీద‌ప‌డిన‌పుడు, ఉద్యోగం పోవ‌డం జ‌రిగితే ఆస‌రాగా ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప‌థ‌కం గురించి:

  • ఏపీఎన్ఆర్‌టీ స‌భ్యులంద‌రికీ ఈ ప‌థ‌కం అందుబాటులో ఉంటుంది.

  • మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. పున‌రుద్ధ‌రించుకునే అవ‌కాశం ఉంది.

  • ఏడాదికి రూ.50 నామ‌మాత్ర‌పు రుసుము చెల్లించాలి.

  • క్లెయిమ్ ప‌రిష్కారంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సులువుగా అవుతుంది.

ప్ర‌యోజ‌నాలు:

  • ప్ర‌మాద వ‌శాత్తు మ‌ర‌ణించినా లేదా శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం కార‌ణంగా ఉద్యోగం కోల్పోతే ఆ వ్య‌క్తి కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు అందుతుంది.

  • బీమా చేసిన వ్య‌క్తి స‌హాయ‌కుల్లో ఒక‌రికి స్వ‌దేశానికి వ‌చ్చేందుకు విమాన ఛార్జీ పొంద‌వ‌చ్చు.

  • అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు ఏడాదికి రూ. 50,000 ఆరోగ్య ఖ‌ర్చుల‌కు క‌వ‌రేజీ ల‌భిస్తుంది.

  • జ‌బ్బు ప‌డి ఆసుప‌త్రిలో చేరితే రూ. 1 ల‌క్ష వ‌ర‌కూ వైద్య చికిత్స వ్య‌యం అందుతుంది.

  • అనారోగ్యం వ‌ల్ల ఉద్యోగం కోల్పోయిన వారు స్వ‌దేశానికి వ‌చ్చేందుకు ప్ర‌యాణ ఖ‌ర్చులు పొంద‌వ‌చ్చు.

  • ప్ర‌సూతి సంర‌క్ష‌ణ‌, చికిత్స‌ల కోసం రూ.35,000 పొంద‌వ‌చ్చు.

  • ఉద్యోగం, ఉపాధికి సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తితే రూ.45,000 అందుతుంది.

న‌మోదుచేసుకోవ‌డం ఇలా?

నేరుగా www.apnrt.com ద్వారా లేదా స్థానిక ఏపీఎన్ఆర్‌టీ కోఆర్డినేట‌ర్ కు కాల్ చేయ‌డం ద్వారా న‌మోదు చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు