Hyd to BLR: ఇకపై రోజూ ‘అలయన్స్‌ ఎయిర్‌’ సేవలు!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పూర్తి భాగస్వామ్యంలో సేవలందిస్తున్న అలయన్స్‌ ఎయిర్‌ సంస్థ బెంగళూరు నుంచి......

Published : 25 Jun 2021 19:37 IST

బెంగళూరు: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పూర్తి భాగస్వామ్యంలో సేవలందిస్తున్న అలయన్స్‌ ఎయిర్‌ సంస్థ బెంగళూరు,  హైదరాబాద్‌ నగరాల మధ్య ఇకపై ప్రతిరోజూ విమానాలు నడపనున్నట్టు వెల్లడించింది. జులై 12 నుంచి రెండు మెట్రో నగరాల మధ్య నేరుగా తమ విమానాలు సేవలందిస్తాయని పేర్కొంది. 9I 517 విమానం సాయంత్రం 6.45 గంటలకు బెంగళూరులో బయల్దేరి రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుందని వెల్లడించింది. అలాగే 9I 518 విమానం హైదరాబాద్‌లో రాత్రి 8.50 గంటలకు బయల్దేరి రాత్రి 10గంటలకు బెంగళూరుకు చేరుకుంటుందని ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని