Automobile: వాహన ధరలు మరోసారి పెంపు?

ఇటీవలి నెలల్లోనే రెండు సార్లు ధరలు పెంచిన వాహన తయారీ కంపెనీలు, మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడం ఇందుకు నేపథ్యం. గత 9 నెలల్లోనే ఉక్కు ధరలు 50 శాతం మేర పెరిగాయి.

Updated : 28 Jul 2021 12:22 IST

ముడి పదార్థాల వ్యయాల భారం వల్లే

దిల్లీ: ఇటీవలి నెలల్లోనే రెండు సార్లు ధరలు పెంచిన వాహన తయారీ కంపెనీలు, మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడం ఇందుకు నేపథ్యం. గత 9 నెలల్లోనే ఉక్కు ధరలు 50 శాతం మేర పెరిగాయి. దీంతో స్కూటర్ల నుంచి భారీ ట్రక్కుల వరకు తయారు చేసే కంపెనీలు ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు ధరలను పెంచాయి. జూన్‌ త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయన్న అంచనాలు తల్లకిందులవ్వడంతో, ధరలను మళ్లీ పెంచక తప్పదని పేర్కొంటున్నాయి.

గిరాకీ తక్కువగా ఉన్నా..: గిరాకీ ధోరణిని బట్టి ద్విచక్ర వాహన కంపెనీలు.. ధరలపై ఒక నిర్ణయానికి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘గతంలో కంపెనీలు వివిధ సందర్భాల్లో ధరలు పెంచాయి. ముడి పదార్థాల ధరలు పెరిగినపుడు, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినపుడు, జీఎస్‌టీ పెరిగినపుడు.. ఇలా గిరాకీతో సంబంధం లేకుండా పెంచాయి. ఇపుడు కూడా అంతే. గిరాకీ తక్కువగా ఉన్నా అదే పనిచేయొచ్చు. ఎందుకంటే కారు అవసరం ఉన్నవారు తప్పక కొంటారు. ఇపుడు బ్యాంకు రుణ రేట్లు అత్యంత కనిష్ఠ స్థాయిల్లో ఉండడం వారికి కలిసిరావొచ్చ’ని ఒక బ్రోకరేజీ సంస్థ అంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని