Diesel Prices Hike: పెరిగిన డీజిల్‌.. స్థిరంగాపెట్రోల్‌

ఇంధన విక్రయ సంస్థలు ఆదివారం డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం....

Published : 26 Sep 2021 10:21 IST

దిల్లీ: ఇంధన విక్రయ సంస్థలు ఆదివారం(26-09-2021) డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం. గత 21 రోజులుగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా పెంపుతో లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ.96.68, దిల్లీలో రూ.89.07, కోల్‌కతాలో రూ.89.07కు చేరింది.

చివరిసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండూ కలిపి సెప్టెంబరు 5న మారాయి. తర్వాత డీజిల్‌ ధరలను పలుసార్లు పెంచినప్పటికీ.. పెట్రోల్‌ ధరలు మాత్రం మారలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు సెప్టెంబరు 5 నుంచి 6-7 డాలర్లు పెరగడం గమనార్హం. అయినప్పటికీ.. దేశీయంగా పెట్రోల్‌ ధరల్ని పెంచలేదు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి...

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని