ఎయిరిండియా రేసు నుంచి ఉద్యోగుల బృందం ఔట్‌?

ఎయిరిండియా కొనుగోలు రేసులో ఆ సంస్థ ఉద్యోగుల బృందం ఇక లేనట్లేనని తెలుస్తోంది. 200 మందికి పైగా బృందంగా ఏర్పడి, అమెరికాకు చెందిన ఫండ్‌ ఇంటరప్స్‌తో కలిపి సంస్థ కొనుగోలుకు బిడ్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే......

Published : 08 Mar 2021 14:53 IST

దిల్లీ: ఎయిరిండియా కొనుగోలు రేసులో ఆ సంస్థ ఉద్యోగుల బృందం ఇక లేనట్లేనని తెలుస్తోంది. 200 మందికి పైగా బృందంగా ఏర్పడి, అమెరికాకు చెందిన ఫండ్‌ ఇంటరప్స్‌తో కలిపి సంస్థ కొనుగోలుకు బిడ్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం సంస్థను కొనుగోలు చేసేందుకు కావాల్సిన అర్హతలు బిడ్‌లో లేవని ఎయిరిండియా నిర్ధరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రైవేటీకరణ ప్రక్రియలో తదుపరి దశకు ఈ బిడ్‌ను ఎంపిక చేయడం లేదని పేర్కొంటూ సోమవారం వారికి లేఖ రాసినట్లు ఆంగ్ల మీడియా సంస్థ ‘మనీకంట్రోల్‌’ పేర్కొంది. టాటా సన్స్‌, స్పైస్‌జెట్‌ సంస్థలు కొనుగోలు రేసులో ముందున్నట్లు సమాచారం. తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ రెండు సంస్థలు మరింత సమగ్రమైన వివరాలతో ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి...

రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్‌!

గృహ రుణ రేట్లు అందుకు తగ్గాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని