ఇప్పుడు లిక్విడిటీ చాలా ముఖ్యం

ఎప్పుడైనా అత్య‌వ‌స‌రంగా చేతికి డ‌బ్బు అందేలా పెట్టుబ‌డులు ఉండాలి......

Published : 24 Dec 2020 13:30 IST

ఎప్పుడైనా అత్య‌వ‌స‌రంగా చేతికి డ‌బ్బు అందేలా పెట్టుబ‌డులు ఉండాలి

ప్ర‌పంచాన్ని వణికిస్తోన్న క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. అయితే మీ ఆర్థిక జీవ‌నంపై ప్ర‌భావం ప‌డ‌కుండా తీసుకోవాల్సిన కొన్ని ముందు జాగ్ర‌త్త‌లు ఉన్నాయి.

ప‌రిస్థితుల‌కు అనుకూలంగా పెట్టుబ‌డి నిర్ణ‌యాలు
క‌రోనా నేప‌థ్యంలో ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్న ఇటువంటి సంద‌ర్భాల్లో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగి లిక్విడిటీ స‌మ‌స్య రావొచ్చు. ఇలాంటి స‌మ‌యంలో స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల‌ను పెట్టుకోవాలి. ఎప్పుడైనా అత్య‌వ‌స‌రంగా చేతికి డ‌బ్బు అందేలా పెట్టుబ‌డులు ఉండాలి.

మీ ఆర్థిక రికార్డుల‌నుఉ తిర‌గేయండి
మీ పెట్టుబ‌డు గురించి కుటుంభ స‌భ్యుల‌కు తెలియ‌జేయ‌డం ముఖ్యం. ఇప్ప‌టివ‌ర‌కు వీలునామా రాయ‌క‌పోతే ఇప్పుడు ఆ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. పెట్ట‌బ‌డులు స‌రైన స‌మ‌యానికి చేతికందుతాయా లేదా చూసుకోండి. బీమా హామీ ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. ఇప్ప‌టికే ఉన్న రుణాల్లో , ఎక్కువ వ‌డ్డీ రేట్లు ఉన్న వాటిని ముందుగా చెల్లించండి. కొత్త‌గ రుణాలు తీసుకోవ‌ద్దు. అన్ని పెట్టుబ‌డుడులు, ఆస్తుల‌కు సంబంధించిన డాక్యుమెంట్లు స‌రిగ్గా ఉండాలి.

వ్యూహాత్మ‌కంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కోండి
క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించ‌డంతో ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఖ‌ర్చులు త‌గ్గించుకునే అవ‌కాశం ఉంది. వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం, క్రెడిట్ కార్డులు వినియోగించ‌డం త‌గ్గింది. రుణాల‌పై మూడు నెల‌ల మార‌టోరియం ల‌భించిన‌ప్ప‌టికీ క్ర‌మంగానే చెల్లించ‌డం మంచిదని నిపుణుల సూచ‌న‌. త‌ర్వాత వ‌డ్డీ భారం ఉండ‌దు. ఖ‌ర్చులు త‌గ్గించుకొని రుణాల‌ను చెల్లించ‌డం మంచిది.

అన్నింటికి సిధ్ధంగా ఉండండి
లాక్‌డౌన్‌తో ఎదుర‌వుతోన్న న‌ష్టాల కార‌ణంగా కొన్ని కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం లేదా వేత‌నాల్లో కోత విధించ‌డం వంటివి చేస్తున్నాయి. ముందుగానే ఇటువంటి వాటికి సిద్ధంగా ఉండాలి. అత్య‌వ‌స‌రి నిధి ఉండ‌టం ముఖ్యం. పెట్టుబ‌డుల్లో కూడా లిక్విడిటీ ఉండేలా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చ‌లు త‌గ్గించుకొని అవ‌స‌ర‌మైన‌వాటికే మొగ్గుచూపాలి. కొన్నిసార్లు జీవితంలో అన్ని అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌క‌పోయినా మ‌రో ర‌కంగా కూడా ప్ర‌ణాళిక ఉండాలి.

బీమా చాలా ముఖ్యం
క‌రోనా మ‌రోసారి బీమా అవ‌స‌రాన్ని గుర్తుచేస్తోంది. కుటుంబంలో సంపాదించే వ్య‌క్తికి జీవిత బీమా ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. ఆరోగ్య బీమా ప్రాముఖ్య‌త కూడా చాలా ఉంది. ప్రీమియం చెల్లించ‌లేని ప‌రిస్థితిలో జూన్ 30 వ‌ర‌కు గ‌డువును పొడ‌గించింది .

మంచి ప్ర‌ణాళిక ఉన్న‌వారు ఎటువంటి ప‌రిస్థితుల్లోనైనా త‌క్కువ ఇబ్బందులతో బ‌య‌ట‌ప‌డ‌తారు. ఏది ఉముఖ్య‌మో, ఏది అవ‌స‌రమో గుర్తించి దానికి అనుగుణంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా మిలీనియ‌ల్స్ పెట్టుబ‌డుల గురించి అవ‌గాహ‌న పెంచుకునేందుకు స‌రైన స‌మ‌యం ఇది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని