Edible Oil Prices: వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు.. దిగిరానున్న ధరలు!

దేశంలో పెరిగిన వంట నూనెల ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ రకాల నూనెలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించింది....

Published : 11 Sep 2021 20:27 IST

దిల్లీ : దేశంలో పెరిగిన వంట నూనెల ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ రకాల నూనెలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ముడి పామాయిల్‌పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు.

ఇక అన్ని రకాల రిఫైన్డ్‌ ఆయిల్స్‌ ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించారు. తాజా తగ్గింపు నేపథ్యంలో ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. ఇక రిఫైన్డ్‌ ఆయిల్స్‌పై ఉన్న పన్ను 35.75 శాతానికి చేరనున్నాయి.

దేశీయ వంటనూనెల అవసరాల్లో భారత్‌ దాదాపు 60 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. ఇండోనేసియా, మలేషియా నుంచి పామాయిల్‌ వస్తుండగా.. అర్జెంటీనా, బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, రష్యా నుంచి సోయా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని