Life Insurance: ఇ-ట‌ర్మ్ ప్ల‌స్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్

కుటుంబ స‌భ్యుల భ‌విష్య‌త్తును సెక్యూర్ చేసేందుకు ట‌ర్మ్ ప్లాన్‌ను ప్ర‌తీ ఒక్క‌రూ వారి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగం చేయాలి. 

Updated : 25 Nov 2021 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇ-టర్మ్ ప్లస్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ట‌ర్మ్‌ ప్లాన్. జీవితంలో ఎదుర‌య్యే అనిశ్చితుల నుంచి పాల‌సీదారుని కుటుంబ స‌భ్యుల భవిష్య‌త్‌ను సుర‌క్షితం చేసేందుకు ఈ పాల‌సీ డిజైన్ చేసిన‌ట్లు సంస్థ తెలిపింది. ఇది స‌మ‌గ్ర బీమా పాల‌సీ. బీమా చేసిన వ్య‌క్తి ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించినా, శాశ్వ‌త పూర్తి వైక‌ల్యం పొందినా, క్లిష్ట‌మైన వ్యాధుల బారిన ప‌డినా, ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా మ‌ర‌ణించినా అత‌డి కుటుంబానికి ఆర్థిక స‌హాయాన్ని అందిస్తుంది.

పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ను ఏక మొత్తంలో గానీ, క్ర‌మ‌మైన ఆదాయంగా గానీ, లేదా రెండింటి క‌ల‌యికగా గానీ ఎంపిక చేసుకోవ‌చ్చు. పాలసీదారులు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం చెల్లించిన ప్రీమియంలు, అందుకున్న ప్రయోజనాలపై ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ పొందొచ్చు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల ఆలోచ‌న విధానంలో మార్పు వ‌చ్చింది. జీవిత బీమా ప్రాధాన్య‌తను తెలుసుకుని కొనుగోలు చేసేందుకు ముంద‌డుగు వేస్తున్నారు. దీంతో ట‌ర్మ్ ప్లాన్‌కు డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియా ఫస్ట్ ఇన్సురెన్స్‌, పాల‌సీ బ‌జార్ డాట్‌కామ్‌తో క‌లిసి ఇ-ట‌ర్మ్ ప్ల‌స్ ప్లాన్‌ను డిజైన్ చేసింది. ఈ ట‌ర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్‌ మార్కెట్‌లోకి అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన ఆఫర్ల‌తో వ‌స్తుంది. డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా ఈ ప్లాన్ కొనుగోలు చేస్తే.. మొద‌టి సంవ‌త్స‌రం ప్రీమియంల‌పై ప్ర‌త్యేక‌మైన త‌గ్గింపును కూడా అందిస్తోందని సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ఇండియా ఫ‌స్ట్ లైఫ్ వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పెట్టుబ‌డుల ఆధారంగా 45 ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. దేశ‌వ్యాప్తంగా 98 శాతం పిన్‌కోడ్‌ల‌లో వినియోగ‌దారుల‌కు సంస్థ త‌న సేవ‌ల‌ను అందిస్తోంది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని