వారెన్ బ‌ఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన 5 పెట్టుబ‌డి సూత్రాలు

బ‌ఫెట్ మొద‌టి సూత్రం - డ‌బ్బు ఎప్పుడు న‌ష్ట‌పోవ‌ద్దు, రెండ‌వ సూత్రం- మొద‌టిది ఎప్పుడు మ‌ర‌వొద్దు........

Published : 24 Dec 2020 17:16 IST

బ‌ఫెట్ మొద‌టి సూత్రం - డ‌బ్బు ఎప్పుడు న‌ష్ట‌పోవ‌ద్దు, రెండ‌వ సూత్రం- మొద‌టిది ఎప్పుడు మ‌ర‌వొద్దు

వారెన్ బ‌ఫెట్‌, ప్ర‌పంచంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన పెట్టుబ‌డుదారుల్లో ఒక‌రు. ఆదివారం ఆయ‌న 90 వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. ప్ర‌పంచంలో మూడవ అతిపెద్ద సంప‌న్నుడైన‌ వారెన్ బ‌ఫెట్ సంప‌ద మొత్తం 86 బిలియ‌న్ డాల‌ర్లు. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బెర్స్‌షైర్ హాత్‌వే ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీస‌ర్, ఛైర్మెన్ అయిన్ బ‌ఫెట్ యునైటెడ్ స్టేట్స్‌లోని ఒమాహ, నెబ్ర‌స్కా‌లో ఆగ‌స్ట్ 30,1930 న‌ జ‌న్మించాడు. ఆయ‌న‌ మొద‌టి స్టాక్ 1941 లో 11 సంవ‌త్స‌రాల వ‌య‌సులో కొనుగోలు చేశాడు. 13 సంవ‌త్స‌రాల వ‌య‌సులో మొద‌ట‌గా ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేశాడు. పాఠ‌శాల విద్య పూర్త‌య్యే స‌మ‌యానికి ఒమ‌హ‌, నెబ్ర‌స్కాలో 40 ఎక‌రాల భూమిలో వాటాను కొనుగోలు చేశాడు.

ప్ర‌స్తుతం ఫోర్బ్స్ ప్ర‌కారం, బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ 819.7 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ప్ర‌పంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీగా ఉంది. వారెన్ బ‌ఫెట్ ముఖ్య‌మైన జీవ‌న సూత్ర‌ల్లో ఒక‌టి- డ‌బ్బును ఎప్పుడు కోల్పోవ‌ద్దు, రెండ‌వ‌ది - మొద‌టి సూత్రాన్ని ఎప్పుడు మ‌ర్చిపోద్దు. విన‌డానికి ఆశ్ఛ‌ర్యంగా ఉన్న ఆ నియ‌మాల‌ను పాటించాడు కాబ‌ట్టే ఇంత గొప్ప స్థాయికి చేరాడు

వారెన్ బ‌ఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన అయిదు పెట్టుబ‌డి పాఠాలు-

మీకు అవ‌గాహ‌న లేని వ్యాపారంలో పెట్టుబ‌డి పెట్టొద్దు:
వారెన్ బ‌ఫెట్ గోల్డెన్ రూల్స్‌లో ఇదొక‌టి. అంటే అర్థ‌మైన‌, అవ‌గాహ‌న ఉన్న వ్యాపారాల్లోనే పెట్టుబ‌డులు పెట్టాల‌ని బ‌ఫెట్ సూచిస్తాడు. అత‌డు న‌మ్మిన రంగాల్లోనే పెట్టుబ‌డులు పెడతాడు. వ్యాపారంలో లేదా మార్కెట్ల‌లో ఆర్థిక అనిశ్ఛితి ఎదురైన‌ప్పుడు మీరు న‌మ్మిన‌దానినే పాటించండి. పెట్టుబడులు పెట్టేముందు దానికి త‌గిన ప‌రిశోధ‌న చేయ‌డం చాలా ముఖ్యం, ఇది హేతుబ‌ద్దంగా ఉండాలి. మీరు ఇల్లు ఎంత ఇష్ట‌ప‌డి కొంటారో స్టాక్‌ను కూడా అంత ఇష్ట‌ప‌డి, అర్థం చేసుకొని కొనుగోలు చేయాలి. మార్కెట్ లేన‌ప్పుడు మీరు స్టాక్‌ను మీ వ‌ద్దే కొన‌సాగించాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎటువంటి బాధ క‌ల‌గ‌కూడ‌దు. అటువంటి స్టాక్‌పై వెచ్చించాలి.

పెట్టుబ‌డులు చేయ‌పోతే త‌ప్పు చేస్తున్న‌ట్లే:

డ‌బ్బును న‌గ‌దు రూపంలో పొదుపు చేయ‌డం చాలా త‌ప్పు అని భావిస్తారు బ‌ఫెట్. లిక్విడిటీ ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. ఉన్న‌దానితో మ‌రింత సంపాధించేవిధంగా పెట్టుబ‌డుదారుల ఆలోచ‌న‌లు కొన‌సాగాలి. ఇప్పుడు ఎక్కువ డ‌బ్బు క‌లిగిన వ్య‌క్తులు సంతోషంగా ఉంటారు, కానీ అలా ఉండ‌కూడ‌దు. అలా ఉంటే స‌మ‌యం గ‌డిచిన కొద్దీ ఆ డ‌బ్బుపై పొందే లాభం ఏం ఉండ‌క‌పోగా, అది త‌రిగిపోతుంది.

దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి:
మ‌నం ఇప్పుడు ఒక చెట్టు నీడ‌న కూర్చుంటున్నాం అంటే ఎవ‌రో ఒక‌రు గ‌తంలో ఆ చెట్టును నాటారు క‌దా. అదేవిధంగా దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు చాలా ముఖ్యం. అయితే బ‌ఫెట్ నియ‌మం ఎంటంటే మీరు కొనుగోలు చేసే స్టాక్‌, 10 సంవ‌త్స‌రాలు మార్కెట్ ప‌నిచేయ‌పోయినా మీరు సంతోషంగా ఉండ‌గ‌ల‌గాలి. ఎందుకంటే మీరు పెట్టుబ‌డిన పెట్టిన‌ వ్యాపారం ప్ర‌స్తుతం బాగానే ఉన్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో ఎటువంటి మార్పులైనా రావొచ్చు.

మీకోసం మీరు పెట్టుబ‌డి చేసుకోండి:
వారెన్ బ‌ఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన అతిముఖ్య‌మైన పాఠం, మీపై మీరు పెట్టుబ‌డులు పెట్ట‌డం, అత‌డు 90 సంవ‌త్స‌రాల వ‌య‌సులో కూడా ఇంకా నేర్చుకుంటున్నాడు, వ్య‌క్తిగ‌త వృద్ధికి స‌మ‌యం కేటాయించ‌డం అవ‌స‌రం అని చెప్తాడు. రోజు చాలాస‌మ‌యం నాతో నేడు గ‌డుపుతాను, ఆలోచిస్తాను. ఇది ఎక్కువ‌మంది చేయ‌రు కాబ‌ట్టి న‌ష్ట‌పోతుంటారు. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకుంటారు. నేను అలాంటివి చేయ‌ను అని చెప్తారు.

క్రెడిట్ కార్డు రుణాలు:
మిలీనియ‌ల్స్ క్రెడిట్ కార్డుల‌ను పిగ్గీ బ్యాంకులుగా ఉప‌యోగించ‌డాన్ని మానేయాల‌ని బ‌ఫెట్ సూచించారు. క్రెడిట్ కార్డుల రుణాల‌కు 18 శాతానికి పైగా చెల్లిస్తారు. పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డి అంత మొత్తంగా లేన‌ప్పుడు అంత చెల్లించ‌కూడ‌ద‌ని అని ఆయ‌న అభిప్రాయం.

18 శాతం రాబ‌డి ఎలావ‌స్తుందో నాకు తెలియదు. నేను 18 శాతం వడ్డీతో డబ్బు చెల్లించాల్సి ఉంటే, నా దగ్గర ఉన్న ఇత‌ర ఆస్తుల‌తో నేను మొదట క్రెడిట్ కార్డు బ‌కాయిలు చెల్లిస్తాను. నాకు వ‌చ్చిన ఇత‌ర‌ పెట్టుబడి ఆలోచన కంటే ఇది మంచి మార్గం అని బ‌ఫెట్ అంటారు.

జీవితం మొత్తం ఇంత ఎక్కువ‌గా వ‌డ్డీ చెల్లిస్తూ సంతోషంగా గ‌డ‌ప‌లేరు. అందుకే నేను అంద‌రికి చెప్పేదేంటంటే 12 శాతం వ‌డ్డీ కూడా ఎవ‌రికి చెల్లించ‌వ‌ద్దు. ఒకవేళ అంత ఎక్కువ వ‌డ్డీ రుణాలు ఉంటే ముందు వాటిని చెల్లించండి, త‌ర్వాత పెట్టుబ‌డుల గురించి ఆలోచించండి అని చెప్తారు బ‌ఫెట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని