చివ‌రి నిమిషంలో ప‌న్ను ఆదా కోసం పెట్టుబ‌డులు పెడుతున్నారా?

ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డుల‌తో ప‌న్ను ఆదాతో పాటు మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. వేత‌న జీవులు ఈ స‌మ‌యంలో ప‌న్ను ఆదా చేసుకునేందుకు హ‌డావిడిగా పెట్టుబ‌డులు పెడుతుంటారు. అయితే మీ పెట్టుబ‌డులు ఎప్పుడు ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఉండాలి. కేవ‌లం ప‌న్ను ఆదా చేసేందుకే పెట్టుబ‌డులు పెడితే ఆర్థ‌ముండ‌దు. దానికోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌లేంటో తెలుసుకుందాం..

మీ పెట్టుబ‌డుల జాబితాను త‌యారు చేసుకోండి
ఇప్ప‌టికే ఉన్న పెట్టుబ‌డులు ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని దాట‌వ‌చ్చు. అందుకే మొద‌ట‌గా పెట్టుబ‌డుల జాబితాను త‌యారుచేసుకోండి. పెట్టుబడుల‌ను లెక్కించుకోవాలి. కొన్ని సంద‌ర్భాల‌లో ఎక్కువ పెట్టుబ‌డులు చేయ‌క‌పోవ‌చ్చు. మొద‌ట ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే అన్ని పెట్టుబ‌డుల‌ను జాబితా త‌యారు చేసుకోవాలి. ఉద్యోగ భ‌విష్య నిధి, ప్ర‌జా భ‌విష్య నిధి, జీవిత బీమా ప్రీమియం, జాతీయ పొదుపు స‌ర్టిఫికెట్‌, ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌, ఈఎల్ఎస్ఎస్‌, గృహ రుణ చెల్లింపు, ట్యూష‌న్ ఫీజు వంటివి ఒక ఏడాదికి సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంది.

పెట్టుబ‌డుల స‌మ‌తూకం: పెట్టుబ‌డుల జాబితా త‌యారుచేసుకున్న త‌ర్వాత అప్ప‌టికీ ప‌న్ను ఆదా చేసుకునేందుకు మ‌రిన్ని పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మైతే త‌గిన‌ సాధ‌నాల‌ను ఎంచుకోవాలి. అయితే చివ‌రి నిమిషంలో హ‌డావిడిగా పెట్టుబ‌డుల‌ను ఎంచుకోకూడ‌దు. అన్నింటితో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డులు స‌రైన‌వి. అయితే మార్కెట్ల‌లో అనిశ్చితి ఏర్ప‌డిన‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది.

స్థిర‌మైన పెట్టుబ‌డుల కోసంఇ పీపీఎఫ్ ఎంచుకోవ‌చ్చు. మీ లక్ష్యాల‌ ఆధారంగా పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు. లిక్విడిటీ, వ్యయం, రాబ‌డుల‌ను దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఆధారాలు కొన్ని రోజుల్లో లేదా ఆన్‌లైన్ ద్వారా పొంద‌వ‌చ్చు. ఒక‌వేళ ఆల‌స్య‌మ‌యినా రిట‌ర్నులు దాఖ‌లు చేసుకోవ‌చ్చు.

పున స‌మీక్షించుకోండి: ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఒకే దానిలో స్థిర‌ప‌డిపోకుండా పెట్టుబ‌డులు, ప‌న్నుపై అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోండి. ఉదాహ‌ర‌ణ‌కు, బీమా పాల‌సీ కేవ‌లం ప‌న్ను ఆదా చేసుకునేందుకే మీకు స‌రిపోనిది కొనుగోలు చేయ‌కూడ‌దు. ఎన్‌పీఎస్‌లో అద‌నంగా రూ.50 వేల మిన‌హాయింపు ఉంటుంద‌ని అటువైపు మొగ్గుచూపుతారు. అయితే దీనికి లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఎక్కువ కాలం ఉంటుంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి. చిన్న వ‌య‌సు వారికి ఎన్‌పీఎస్ అంత స‌రైన ఎంపిక కాద‌నే చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఫోలియోలో ఇంకా వైవిధ్య‌ పెట్టుబ‌డుల‌ను చేర్చుకుంటే ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చు.
ప‌న్ను ఆదా కొర‌కు ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే పెట్టుబ‌డుల‌ను మొద‌లుపెట్టాలి. అప్పుడు హ‌డావిడి లేకుండా పెట్టుబ‌డుల‌ను మంచి ప‌థ‌కాల‌లో పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. చివ‌రి నిమిషంలో అయినా పెట్టుబ‌డుల జాబితాను త‌యారు చేసుకొని అవ‌స‌ర‌మైన వాటిలో పెట్టుబ‌డులు పెట్టాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని