మొబైల్‌ బ్యాంకింగ్‌

బ్యాంకు సేవలను ఎప్పుడైనా ఎక్కడైనా చేతిలో ఉన్న ఫోన్ ద్వారా పొందేందుకు బ్యాకులు కల్పించే సేవ మొబైల్ బ్యాంకింగ్. వివరాలు..

Published : 15 Dec 2020 16:52 IST

మొబైల్‌ బ్యాంకింగ్‌ అంటే బ్యాంకుకు సంబంధించిన వివిధ రకాల ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను, ఖాతాకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం తదితరాలన్నింటినీ మొబైల్‌ ద్వారానే నిర్వహించడం. సాంకేతికను అందిపుచ్చుకునే వారందరికీ ఇది చాలా ఉపయోగకరం. తద్వారా బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలన్నీ చేతిలో ఉన్న మొబైల్‌ ద్వారానే పొందే వీలుంది.

సేవలన్నీ ఒకచోట నుంచే

పొదుపు ఖాతా సేవలు

ఖాతాలో నిల్వ తెలుసుకోవడం, మినీ స్టేట్‌మెంట్లు, లావాదేవీల స్టేట్‌మెంట్లు, రికరింగ్‌ డిపాజిట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తెరవడం వంటివి

క్రెడిట్‌ కార్డు సేవలు

బ్యాలెన్స్‌ వివరాలు, క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపు, చివరి చెల్లింపు వివరాలు, చెల్లించవలసిన మొత్తం

రుణ ఖాతా

ప్రొవిజనల్‌ ఐటీ ధ్రువీకరణ పత్రం, రుణ ఒప్పంద పత్రం, మిగులు రుణం వివరాలు

డీమ్యాట్‌ ఖాతా

హోల్డింగ్స్‌ విచారణ, లావాదేవీల వివరాలు, మొత్తం స్టాక్‌ విలువ మొదలైనవి

పై వ్యవహారాలను మొబైల్‌ నుంచే నిర్వహించవచ్చు.

బ్యాంక్‌ ఖాతాకు వర్తించే సేవలు

ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌

మన ఖాతా నుంచి ఇతర బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేయవచ్చు. ఎన్‌ఈఎఫ్‌టీ లేదా ఐఎమ్‌పీఎస్‌ ద్వారా ఇతర ఐసీఐసీఐ ఖాతాలతోపాటు, ఇతర బ్యాంకులకు చెందిన ఖాతాలకు సైతం నగదు బదిలీని చేసే వీలుంది.

నగదు నిల్వ విచారణ

ఖాతాలో నగదు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు.

చివరి ఐదు లావాదేవీలు

మీ ఖాతాలో జరిపిన చివరి లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు.

ఐఎమ్‌పీఎస్‌

మొబైల్‌ ఫోన్‌, ఎమ్‌ఎమ్‌ఐడీ ఉపయోగించి నగదు లావాదేవీలను జరుపవచ్చు. (ఐఎమ్‌పీఎస్‌ లింక్‌)

రికరింగ్‌ డిపాజిట్‌

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. తర్వాత బ్యాంకు ఖాతా ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఖాతా నెంబరును ఎంచుకోవాలి. రికరింగ్‌ ఖాతా తెరిచే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ సూచించిన విధంగా అనుసరించాలి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

అప్లికేషన్‌తో అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతా నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే వీలుంది. ఇందుకోసం ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. బ్యాంక్‌ ఖాతా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఏ ఖాతా నంబరు నుంచి చేయాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.

చెక్కు రిక్వెస్ట్‌ను ఆపడం

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. బ్యాంకు ఖాతా ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఖాతా నెంబరును ఎంచుకోవాలి. సేవల్లో స్టాప్‌ చెక్కు రిక్వెస్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చెక్కు నంబరును నమోదు చేయాలి. సబ్‌మిట్‌ మీటను నొక్కాలి. ఇప్పుడు చెక్కు రిక్వెస్ట్‌ ఆగిపోతుంది.

చెక్కు స్టేటస్‌ ఎంక్వైరీ

చెక్కు ఏ దశలో ఉందో ఐమొబైల్‌ ద్వారా మీరు ఉన్న చోట నుంచే తెలుసుకోవచ్చు. ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అయి బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి. సేవల్లో చెక్కు స్టేటస్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ దశలో చెక్కు నంబరును నమోదు చేయాలి. వెంటనే మీ చెక్కు స్టేటస్‌ తెలిసిపోతుంది.

చెక్కు బుక్‌ రిక్వెస్ట్‌

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. బ్యాంకు ఖాతా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. సేవల్లో చెక్కు బుక్‌ రిక్వెస్ట్‌ అనే సేవను ఎంచుకోవాలి. ఐసీబీఆర్‌(ఇనిషియేట్‌ చెక్‌బుక్‌ రిక్వెస్ట్‌) అని 5676766 అనే నంబరుకు సంక్షిప్త సందేశాన్ని పంపాలి. మీ రిజిస్టర్ట్‌ మొబైల్‌ నంబరు నుంచే ఈ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది.

క్రెడిట్‌ కార్డుకు వర్తించే సేవలు

బ్యాలెన్స్‌ తెలుసుకోవడం

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. క్రెడిట్‌ కార్డు ఐకాన్‌ ఎంచుకోవాలి. సేవల్లో ‘నగదు వివరాలు’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత బ్యాలెన్స్‌ వివరాలు మీ మొబైల్‌లో ప్రత్యక్షమవుతాయి.

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపు

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. బిల్‌పే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తదుపరి పేమెంట్‌ బిల్స్‌ ఆప్షన్‌, ఆ తర్వాత క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపును ఎంచుకోవాలి.

చివరి బిల్లు చెల్లింపులు

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. క్రెడిట్‌ కార్డు ఐకాన్‌ ఎంచుకోవాలి. సేవల్లో ‘చివరి బిల్లు చెల్లింపు’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చివరి చెల్లింపుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా తెలుసుకోవచ్చు.

చెల్లించాల్సిన పేమెంట్స్‌ వివరాలు

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. క్రెడిట్‌ కార్డు ఐకాన్‌ ఎంచుకోవాలి. 
సేవల్లో పేమెంట్‌ చేయాల్సిన తేదీని ఎంచుకోవాలి. మీరు చెల్లించాల్సిన మొత్తం, ఎప్పటిలోపు చెల్లించాల్సి ఉంది అనే వివరాలు ప్రత్యక్షమవుతాయి.

రుణ ఖాతాకు వర్తించే సేవలు

రుణ ఖాతాకు సంబంధించిన ప్రొవిజనల్‌ ఐటీ ధ్రువపత్రం, తుది ఐటీ ధ్రువపత్రం, రీషెడ్యూల్డ్‌ లేఖ, రుణ ఒప్పంద పత్రం, మిగులు రుణం తదితర సేవలను ఆన్‌లైన్‌లో మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు.

ప్రొవిజనల్‌ ఐటీ ధ్రువపత్రం

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. ఇతర ఖాతాల్లో రుణ ఖాతా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రుణ ఖాతా నంబరును ఎంచుకోవాలి. సేవల్లో ప్రొవిజనల్‌ ఐటీ ధ్రువపత్రం అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే ఏడు రోజుల్లోగా మనం సూచించిన చిరునామాకు పంపుతారు.

తుది ఐటీ ధ్రువపత్రం

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. ఇతర ఖాతాల్లో రుణ ఖాతా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రుణ ఖాతా నంబరును ఎంచుకోవాలి. సేవల్లో తుది ఐటీ ధ్రువపత్రం అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రీషెడ్యూల్డ్‌ లేఖ

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. ఇతర ఖాతాల్లో రుణ ఖాతా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రుణ ఖాతా నంబరును ఎంచుకోవాలి. సేవల్లో రీషెడ్యూల్డ్‌ లేఖను ఎంచుకోవాలి.

మిగులు రుణం

ఐమొబైల్‌ అప్లికేషన్‌లో లాగిన్‌ అవ్వాలి. ఇతర ఖాతాల్లో రుణ ఖాతా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రుణ ఖాతా నంబరును ఎంచుకోవాలి. సేవల్లో మిగులు రుణం అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

4. డీమ్యాట్‌ ఖాతాకు వర్తించే సేవలు

డీమ్యాట్‌కు సంబంధించిన హోల్డింగ్‌ విచారణ, లావాదేవీ స్థితి, బిల్‌ ఎంక్వైరీ, ఐఎస్‌ఐఎన్‌ ఎంక్వైరీ, స్టాక్‌ హోల్డింగ్‌ పూర్తి విలువ వంటి వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు.

ఎమ్‌షాప్‌

ఇప్పుడు అందరూ ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు. షాపింగ్‌కు సమయమే దొరకట్లేదు. దీన్ని సులువుగా చేసేందుకు ఎమ్‌షాప్‌ను రూపొందించారు. మొబైల్‌ రీఛార్జీ మొదలుకొని విమాన ప్రయాణ టికెట్ల వరకూ దీని ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మొబైల్‌ రీఛార్జ్‌

అప్లికేషన్‌లో లాగిన్‌ అయిన తర్వాత ఎమ్‌షాప్‌ ఐకాన్‌ను ఎంచుకోవాలి. సేవల్లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీఛార్జ్‌ను ఎంచుకోవాలి. రీఛార్జ్‌ ఎంత చేసుకోవాలో నమోదు చేయాలి. పేమెంట్‌ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ డెబిట్‌కార్డు వివరాలు నమోదు చేయాలి. దీంతో రీఛార్జ్‌ పూర్తవుతుంది.

సినిమా టికెట్ల కొనుగోలు

అప్లికేషన్‌లో లాగిన్‌ అయి ఎమ్‌షాప్‌ ఐకాన్‌ను ఎంచుకోవాలి. సేవల్లో మూవీ టికెటింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పేమెంట్‌ పూర్తయిన తర్వాత మొబైల్‌కు టికెట్‌ వివరాలతో కూడిన సంక్షిప్త సందేశం అందుతుంది.

బస్సు టికెట్లు

బస్సు టికెట్లకు వివిధ వెబ్‌సైట్లు ఉన్నా చెల్లింపుల కోసం పేమెంట్‌ గేట్‌వేను ఆశ్రయించాలి. అదే బ్యాంక్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ఉపయోగిస్తే నేరుగా బస్సు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.
దీని కోసం మొదట అప్లికేషన్‌లో లాగిన్‌ అయి ఎమ్‌షాప్‌ను ఎంచుకోవాలి. సేవల్లో బస్‌ టికెటింగ్‌ను ఎంచుకోవాలి. అక్కడ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్‌ పూర్తవగానే నమోదిత మొబైల్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది.

విమాన టికెట్లు

అప్లికేషన్‌లో లాగిన్‌ అయిన తర్వాత ఎమ్‌షాప్‌ ఐకాన్‌ను ఎంచుకోవాలి. సేవల్లో ఎయిర్‌ టికెటింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. సూచించిన విధంగా వివరాలు పూర్తిచేసి విమాన టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

డీటీహెచ్‌ రీఛార్జీ

అప్లికేషన్‌లో లాగిన్‌ అయి ఎమ్‌షాప్‌ ఐకాన్‌ను ఎంచుకోవాలి. సేవల్లో డీహెచ్‌ రీఛార్జ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డీటీహెచ్‌ కంపెనీని ఎంచుకోవాలి. చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదుచేయాలి. చెల్లింపు కోసం కొన్ని వివరాలు నింపగానే పేమెంట్‌ పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని