Petrol Price: చల్లారని పెట్రో ధరల మంట!

పెట్రోలు ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు విక్రయ సంస్థలు మూడుసార్లు ధరలు. తాజాగా ఆదివారం లీటరు పెట్రోలుపై రూ.36 పైసలు, లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున పెంచాయి.  తాజా పెంపుతో....

Updated : 04 Jul 2021 12:29 IST

దిల్లీ: పెట్రోలు ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు విక్రయ సంస్థలు మూడుసార్లు ధరలు పెంచాయి. తాజాగా ఆదివారం లీటరు పెట్రోలుపై రూ.36 పైసలు, లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున పెరిగింది.  ఈ పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్  రూ.103.41; డీజిల్‌ రూ.97.40కు చేరుకుంది. తిరుపతి, విజయవాడలలో డీజిల్‌ ధరలు సెంచరీకి చేరువవుతున్నాయి.

ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోల పెరుగుదల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 35 సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ.9.12 పెరిగింది. ఇదే సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ. 8.71 ఎగబాకింది.

వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు/డీజిల్‌ ధరల వివరాలు రూపాయల్లో..

నగరం                పెట్రోలు        డీజిల్‌

దిల్లీ                  99.51         89.36

కోల్‌కతా              99.45         92.27

ముంబయి           105.58         96.91

చెన్నై                100.53         93.99

బెంగళూరు          102.84         94.72

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని