కాంపౌండింగ్‌ నేరాల దర్యాప్తునకు సెబీ

సెబీ చట్టంలో సెక్షన్‌ 24ఏ కింద కాంపౌండింగ్‌ నేరాల దర్యాప్తునకు సెబీ సమ్మతి తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. అయితే సెక్యూరిటీల మార్కెట్‌లో స్థిరత్వం, మదుపర్ల రక్షణకు సెబీ అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరని వెల్లడించింది.

Published : 24 Jul 2021 01:22 IST

అనుమతి తప్పనిసరి కాదు సుప్రీం కోర్టు

దిల్లీ: సెబీ చట్టంలో సెక్షన్‌ 24ఏ కింద కాంపౌండింగ్‌ నేరాల దర్యాప్తునకు సెబీ సమ్మతి తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. అయితే సెక్యూరిటీల మార్కెట్‌లో స్థిరత్వం, మదుపర్ల రక్షణకు సెబీ అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరని వెల్లడించింది. విచారణ జరుగుతున్న కేసుల్లో సెబీ ఏ నిర్ణయాన్ని వీటో అధికారంతో తీసుకోలేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. సెబీ నియంత్రణ సంస్థ అయినందున సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌), కోర్టులు సెబీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని