stock market: మందకొడిగా సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం మందకొడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 సమయంలో సెన్సెక్స్‌ 22పాయింట్ల నష్టంతో 52,460 వద్ద, నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో

Updated : 01 Jul 2021 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం మందకొడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 సమయంలో సెన్సెక్స్‌ 22పాయింట్ల నష్టంతో 52,460 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 15,717 వద్ద ట్రేడవుతున్నాయి. లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడుతున్నాయి. జైన్‌ ఇరిగేషన్‌, ఐఐఎఫ్‌ఎల్‌, హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కో, సుజ్లాన్‌ ఎనర్జీ, ఆగ్రోటెక్‌ ఫుడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. వొడాఫోన్‌ ఐడియా,అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, హిమాద్రి స్పెషాలిటీ, సీక్వెంట్‌ సైంటిఫిక్‌ సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నేటి నుంచి ఆటోమొబైల్‌ కంపెనీలు జూన్‌ డేటాను విడుదల చేయనుండటంతో ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. 

ఎంసీఎక్స్‌ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ. 276 పెరిగి రూ. 46,831 వద్ద , వెండి రూ.848  పెరిగి రూ. 68,080 వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.01పైసలు తగ్గి రూ.74.13 వద్ద  ఉంది. అమెరికాలోని ‌డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ మాత్రం నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించింది. ఆసియాలోని జపాన్‌ నిక్కీ, కొరియా కేవోఎస్‌పీఐ, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌200 సూచీలు కుంగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని