ప్ర‌త్యేక ఎఫ్‌డీల‌కు గ‌డువు పెంపు

సాధార‌ణ ఎఫ్‌డి ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 50 బేసిస్ పాయింట్ల‌ను (బీపీఎస్‌) అందిస్తాయి. 

Published : 15 Apr 2021 10:49 IST

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం జూన్ చివ‌రి వ‌ర‌కు పొడిగించ‌బ‌డింది.

సాధార‌ణ ఎఫ్‌డి ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 50 బేసిస్ పాయింట్ల‌ను (బీపీఎస్‌) అందిస్తాయి. ప్ర‌త్యేక ఎఫ్‌డీ స్కీమ్ దానిపైన అద‌న‌పు వ‌డ్డీ రేటును అందిస్తుంది మ‌రియు ఇది తాజా డిపాజిట్లు, పున‌రుద్ధ‌రించిన‌ డిపాజిట్ల‌పై వ‌ర్తిస్తుంది.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ప‌థ‌కాల‌ను 20 జూన్ 2021 వ‌ర‌కు పొడిగించారు. మే 2020లో, కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి స‌మ‌యాన‌, త‌గ్గుతున్న వ‌డ్డీ రేట్ల మ‌ధ్య‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ మ‌రియు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం 5 సంవ‌త్స‌రాల మ‌రియు అంత‌కంటే ఎక్కువ కాలం ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టాయి.

బ్యాంకు ఎఫ్‌డీలో దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు పెట్టాల‌ని చూస్తున్న సీనియ‌ర్ సిటిజన్స్‌ ఇప్పుడు ఈ బ్యాంకుల‌న్నీ గ‌డువు పెంచినందున 20 జూన్ 2021 వ‌ర‌కు మ‌దుపు చేయ‌వ‌చ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)

సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ఎస్‌బీఐ `వీకేర్ డిపాజిట్‌` ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం సాదార‌ణ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) వ‌డ్డీ రేటు అందిస్తుంది.  ప్ర‌స్తుతం, ఎస్‌బీఐ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.4% వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడితే, ఎఫ్‌డీకి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.20% అవుతుంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందించే సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్ ఎఫ్‌డీ స్పెష‌ల్ ఎఫ్‌డీ ప‌థ‌కం డిపాజిట్ల‌పై 75 బీపీఎస్ అధిక వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్ ఎఫ్‌డీ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడితే, ఎఫ్‌డీకి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25% అవుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌

ఈ డిపాజిట్ల‌పై ఐసీఐసీఐ బ్యాంక్ 80 బీపీఎస్ అధిక వ‌డ్డీ రేటును అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ ప‌థ‌కం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సంవ‌త్స‌రానికి 6.30% వ‌డ్డీ రేటును అందిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఈ డిపాజిట్ల‌పై 100 బీపీఎస్ అధికంగా అందిస్తుంది. ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం కింద (5 సంవ‌త్స‌రాల నుండి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు) ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడితే, ఎఫ్‌డీకి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని