Stock market Closing Bell: లాభాల జోరుకు బ్రేక్!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల జోరుకు బ్రేక్‌ పడింది. బుధవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి....

Published : 01 Sep 2021 15:57 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల లాభాల జోరుకు బ్రేక్‌ పడింది. బుధవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. గతకొన్ని రోజుల బుల్‌పరుగు నేపథ్యంలో ముదపర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు స్థిరీకరణ దిశగా సాగాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడం సూచీలను నిరుత్సాహపరిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.09 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌ 57,763 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. ఇంట్రాడేలో 57,918 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 214 పాయింట్ల నష్టంతో 57,338 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 55 పాయింట్లు దిగజారి 17,076 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో సగానికిపైగా షేర్లు నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, బజాజ్‌ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. ఎంఅండ్‌ఎం, టాటాస్టీల్‌, బజాజ్‌పిన్‌సర్వ్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని