Updated : 01 Jan 2021 17:35 IST

అపార్టుమెంట్లో ఫ్లాట్ కొనే ముందు ఇది గమనించారా?

మీరు అమ్ముతున్నది కేవలం భవనాన్ని మాత్రమేనని, అది ఉన్న భూమికి మీరు యజమాని కాదన్న విషయాన్ని తెలుసుకుంటారు.

సొంత ఇల్లు అనేది ప్ర‌తీ ఒక్కరి కల. ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత కలిగే ఆనందం, గర్వం చాలా అద్భుతమైనది. మనం కొనుగోలు చేసిన ఆస్తి తక్కువ ధరకు అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో లభిస్తే మన ఆనందానికి అవధులు ఉండవు. ఏవైనా కారణాల వల్ల అలాంటి ఆస్తిని విక్రయించాల్సి వస్తే మీరు చాలా ధీమాగా ఉండవచ్చు. ఎందుకంటే అన్ని సదుపాయాలు ఉన్న ఆస్తిని కొనడానికి ఎక్కువ‌ మంది ఆసక్తి కనబరుస్తారు. త‌క్కువ స‌మ‌యంలోనే మీ ఆస్తిని ఇతరులకు విక్రయించవచ్చు. ఒకసారి ఆస్తిని విక్రయించిన తరువాత మీరు ధనవంతులుగా మారతారు. చాలా మంది కొనుగోలుదారులు మీ ద‌గ్గ‌ర‌ ఆస్తిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ వారందరూ కొనుగోలు చేసే సమయం వచ్చేసరికి ఆస్తిని తిరస్కరిస్తూ ఉంటారు. తిరస్కరించే ముందు వారడిగే ఒకే ఒక్క ప్రశ్న “ఒప్పంద పత్రంలో మీ విభజించని వాటా భూమి ఎక్కడ ఉంది.”

ఒప్పంద పత్రంలో మీ పేరున కొంత భూమి ఉందా?

కొనుగోలుదారులు ఆస్తిని కొనుగోలు చేయడానికి తిరస్కరిస్తూ ఉంటే మీరు షాక్ కి గురవుతారు. అనంతరం కొంత సమయానికి తేరుకుని మీరు అమ్ముతున్నది కేవలం భవనాన్ని మాత్రమేనని, అది ఉన్న భూమికి మీరు యజమాని కాదన్న విషయాన్ని నెమ్మదిగా తెలుసుకుంటారు. విభజించని వాటా భూమి అనే పదాన్ని సాధారణంగా రియల్ ఎస్టేట్ లో ఉపయోగిస్తూ ఉంటారు.

విభజించని వాటా భూమి అంటే ఏమిటి?

విభజించని వాటా భూమి అనేది ఫ్లాట్ ని కొనుగోలు చేసిన సమయంలో మీరు సొంతం చేసుకున్న వాటా భూమి. సాధారణంగా ఫ్లాట్ లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే సమయంలో మీరు రెండిటిని కొనుగోలు చేస్తారు.

  1. నిర్మించిన భవనంలో ఫ్లాటు
  2. భవనం నిర్మించిన భూమిలో మీ వాటా

రియల్ ఎస్టేట్లో ధర పెరుగుదల అనేది భూమి ధ‌ర ఆధారంగానే ఉంటుంది. ఎందుకంటే భవనం విలువ అనేది సాంకేతికంగా కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంది. ఇక్కడ భవనం కన్నా భూమి విలువ అనేది ప్రధాన విషయం.

కొన్ని సంవత్సరాల తర్వాత మీ భవన నిర్మాణాన్ని పునః నిర్మించడమో లేదా నూతనంగా నిర్మించడమో చేయవలసి రావచ్చు. ఆ సమయంలో మీకు చెందిన భూమి విలువ ఒక్కటే ప్రాధాన్యమైనది. ఒకవేళ మీరు అపార్టుమెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నట్లైతే విభజించని వాటా భూమి అనేది మీ పేరు మీద కాకుండా సొసైటీ పేరు మీద ఉంచొచ్చు. ఎందుకంటే వారు సొసైటీలో షేర్ హోల్డెర్గా ఉన్నారు.

భూమి వైశాల్యం బ‌ట్టి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ యజమానులకు భూమిని సమానంగా పంచుతారు.

ఇక్కడ ఫ్లాటు కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి వాటా అనేది అపార్ట్మెంట్ నిర్మించిన స్థ‌ల వైశాల్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

ఉదాహరణకు ఒక 1000 చదరపు గజాల భూమిలో 10 ప్లాట్లను కట్టారనుకుందాం. అప్పుడు ఒక్కో ఫ్లాట్ యజమానికి 10 శాతం భూమి వాటాగా వస్తుంది.

ఫ్లాట్ యజమానులకు బిల్డర్ తక్కువ వాటా భూమిని కేటాయించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తగ్గించిన వాటాలో కొంత భాగం బిల్డర్ అలాగే మరికొంత భాగం అసలు భూమి యజమాని తమ అధీనంలో ఉంచుకుంటారు.

ముఖ్యమైన విషయం - అపార్ట్మెంట్ వ్యవస్థలో ఫ్లాటు వైశాల్యం బ‌ట్టి భూమి కేటాయింపు ఉంటుంది. అదే కోప‌రేటివ్ సొసైటీలో అయితే వారికున్న ఫ్లాటు వైశాల్యాన్ని బ‌ట్టి కాకుండా ప్రతీ ఒక్కరికి సమాన వాటా ఇస్తారు.

ఒప్పంద పత్రంలో తనిఖీ చేయాల్సిన విషయాలు?

మీరు ఫ్లాట్ ను కొనుగోలు చేసిన అనంతరం, బిల్డర్ మీకు ఒక తేదీని చెప్పి ఆ సమయంలో రిజిస్టర్ కార్యాలయానికి రావలసిందిగా కోరతాడు. అక్కడే రిజిస్ట్రేషన్ తాలూకా పనులన్నీ పూర్తి అవుతాయి. కొన్ని సందర్భాల్లో కొంత మంది బిల్డర్లు ఒప్పంద పత్రాన్ని చూపించడానికి విముఖత తెలుపుతారు. కానీ మీరు ఒప్పంద పత్రాన్ని చూపించవలసిందిగా బిల్డర్ ను అడగండి. అనంతరం ఒప్పంద పత్రాన్ని పూర్తిగా, జాగ్రత్తగా పరిశీలించాలి.

ఒప్పంద పత్రంలో మొత్తం అపార్ట్మెంట్లో భూమి వాటా శాతం అలాగే భూమి విస్తీర్ణం చదరపు అడుగుల్లో తెలిపారో లేదో గమనించాలి. బిల్డర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పిలిచిన సమయానికి కన్నా ఒక గంట ముందుగా అక్కడికి చేరుకొని ఒప్పంద పత్రాన్ని జాగ్రత్తగా చదవడం మంచిది. ఒకవేళ కుదిరితే మీతో పాటు మీ న్యాయవాదిని కూడా తీసుకువెళ్లి అతనిని కూడా ఒప్పంద పత్రం పూర్తిగా చదవమని చెప్పడం మరింత మంచిది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని