FD: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన బంధన్‌ బ్యాంక్‌

బంధన్‌ బ్యాంకు రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

Published : 06 Feb 2023 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంధన్‌ బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు వరకు పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధి గల డిపాజిట్లపై బ్యాంకు సాధారణ పౌరులకు 3% నుంచి 8% వరకు, సీనియర్‌ సిటిజన్లకు 3.75% నుంచి 8.50% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సాధారణ పౌరులు ఒక సంవత్సరం డిపాజిట్‌పై 7.25%, సీనియర్‌ సిటిజన్లు 7.75% వడ్డీను అందుకోవచ్చు.

సాధారణ పౌరులకు 600 రోజుల ఎఫ్‌డీపై 8.00% గరిష్ఠ వడ్డీ లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లు ఇదే ఎఫ్‌డీపై గరిష్ఠంగా 8.50% వరకు పొందొచ్చు. రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ సవరించిన రేట్లు 2023 ఫిబ్రవరి 6 నుంచి అమల్లోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని