ఈ బ్యాంకు ఏటీఎంల్లో ఎన్ని విత్‌డ్రాలైనా ఫ్రీ!

దేశంలోని చాలా వరకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు త‌మ సొంత బ్యాంకు ఏటీఎంల వ‌ద్ద‌ 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక‌, ఆర్థికేత‌ర లావాదేవీల‌తో క‌లిపి) అందిస్తున్నాయి. అదే ఇత‌ర బ్యాంకు ఏటీఎంల వ‌ద్ద మెట్రో న‌గ‌రాల‌ల్లో 3..........

Updated : 21 Jun 2021 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలోని చాలా వరకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు త‌మ సొంత బ్యాంకు ఏటీఎంల వ‌ద్ద‌ 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక‌, ఆర్థికేత‌ర లావాదేవీల‌తో క‌లిపి) అందిస్తున్నాయి. అదే ఇత‌ర బ్యాంకు ఏటీఎంల వ‌ద్ద మెట్రో న‌గ‌రాల‌ల్లో 3, ఇత‌ర ప్ర‌దేశాల్లో 5 ఉచిత లావాదేవీలు నిర్వ‌హించేందుకు ఖాతాదారుల‌ను అనుమ‌తిస్తున్నాయి. ఈ పరిమితి మించి చేసే లావాదేవీలపై ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఒక్కో ఆర్థిక లావాదేవీకి ప్రస్తుతం ₹ 15, ఆర్థికేతర లావాదేవీలకు ₹5 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ₹17, ₹6 కు పెంచేందుకు బ్యాంకుల‌కు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. పెరిగిన ఫీజులు ఆగ‌స్టు 1 నుంచి అమ‌ల్లోకి వస్తాయి. అయితే అపరిమిత ఏటీఎం లావాదేవీలూ అందిస్తున్న బ్యాంకులూ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఇండ‌స్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ, సిటీ బ్యాంక్‌.. ఈ మూడు బ్యాంకులు త‌మ ఖాతాదారుల‌కు అప‌రిమిత ఉచిత లావాదేవీల‌ను అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన ప్రొడెక్ట్‌ల‌కు మాత్ర‌మే ఏటీఎం వ‌ద్ద అప‌రిమిత ఉచిత లావాదేవీల‌ను నిర్వ‌హించుకునే స‌దుపాయాన్ని అందిస్తోంది. మిగిలిన వాటికి ఆర్‌బీఐ నిర్దేశించిన క‌నీస ఉచిత ప‌రిమితుల‌కు అనుగుణంగా ఏటీఎం వ‌ద్ద లావాదేవీలు నిర్వ‌హించుకునే స‌దుపాయాన్ని కల్పిస్తోంది. బ్యాంక్ సొంత ఏటీఎంల‌లో మొద‌టి 5 లావాదేవీలు ఉచితం. త‌రువాత నుంచి ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఇత‌ర బ్యాంకుల ఏటీఎం వ‌ద్ద 6 మెట్రో న‌గ‌రాల్లో 3 లావాదేవీలు, ఇత‌ర ప్ర‌దేశాల‌లో 5 ఉచిత లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌చ్చు.

భార‌త్‌లోని ఏ బ్యాంక్ ఏటీఎం వ‌ద్ద‌నైనా అప‌రిమిత ఉచిత లావాదేవీల‌ను స‌దుపాయాన్ని అందిస్తోంది ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌. డెబిట్ కార్డును ఉప‌యోగించి దేశంలోని ఏ ఏటీఎం వ‌ద్ద‌నైనా, ఎన్నిసార్లైనా ఉచితంగా న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చ‌ని బ్యాంక్ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. సిటీ బ్యాంక్ కూడా అప‌రిమిత ఉచిత లావాదేవీల‌ను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2021 జులై 1న పునరుద్ధరించిన ఏటీఎం విత్‌డ్రా నియమాల ప్రకారం.. పొదుపు ఖాతాలో ₹25 వేల కంటే ఎక్కువ నెల‌వారీ స‌గటు బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న ఖాతాదారుల‌కు స్టేట్ బ్యాంక్ గ్రూప్‌ (ఎస్‌బీజీ) ఏటీఎంల వ‌ద్ద అప‌రిమిత ఉచిత లావాదేవీల‌ను అనుమ‌తిస్తోంది. ల‌క్ష కంటే ఎక్కువ నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హించే వారికి ఎస్‌బీఐ గ్రూప్ ఏటీఎంలతో పాటు ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల వద్ద కూడా అప‌రిమిత ఉచిత లావాదేవీలు జరుపుకొనే వెసులుబాటు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని