Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా నికర లాభం రూ.4,070 కోట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Published : 05 Aug 2023 16:28 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of baroda) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 87.72% వృద్ధితో రూ.4,070.1 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.2,168.1 కోట్లుగా ఉంది. అలాగే సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.29,878.07 కోట్లుగా ఉంది. గతేడాది రూ.20,119.52 కోట్లతో పోలిస్తే ఇది 48.50 శాతం ఎక్కువ.

బ్యాంక్‌ నికర NPAలు గతేడాది రూ.12,652.74 కోట్లుగా ఉంటే.. జూన్‌ త్రైమాసికంలో రూ.7,482.45 కోట్లకు తగ్గినట్లు బ్యాంకు తెలిపింది. అలాగే, బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు గతేడాది 6.26 శాతంతో పోలిస్తే 3.51 శాతానికి తగ్గాయి. ఆటోమొబైల్‌ రుణాలు 22.10%, గృహ రుణాలు 18.40%, వ్యక్తిగత రుణాలు 82.90%, మార్టగేజ్‌ రుణాలు 15.80%, విద్యా రుణాలు 20.80 శాతం మేర వృద్ధి నమోదైనట్లు బ్యాంక్ తెలిపింది. వ్యవసాయ రుణ పోర్ట్‌ఫోలియో 15.10 శాతం పెరిగి రూ.1,27,583 కోట్లకు చేరుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు దేశవ్యాప్తంగా 8,205 బ్రాంచ్‌లు, 10,459 ATMలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు