Cab Ride: రైడ్‌ బుక్‌ చేసినప్పుడు ₹730.. బిల్‌ చూస్తే ₹5194..!

cab ride: తెలియని ప్రదేశాల్లో ఎక్కడకి వెళ్లాలన్నా ఆన్‌లైన్‌లో రైడ్ బుక్‌ చేసుకొని వెళ్లిపోతుంటాం. ఇలా రైడ్‌ బుక్‌ చేసుకున్న ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది.

Published : 25 Jan 2024 02:27 IST

cab ride | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌లో రైడ్‌ బుక్‌ చేసుకున్న ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్‌ బుక్‌ చేసుకున్న సమయంలో రైడ్ ధర రూ.730 చూపించడంతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. తీరా గమ్యస్థానాన్ని చేరాక రైడ్‌ ధర రూ.5194 అయిందని డ్రైవర్‌ చెప్పాడు. దీంతో అతడు షాక్‌ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..?

అనురాగ్‌ కుమార్‌ సింగ్‌ అనే ఓ కాలేజీ విద్యార్థి కలకత్తా నుంచి బెంగళూరు బయల్దేరి వెళ్లాడు. కెంపెగౌడ విమానాశ్రయం నుంచి మతికెరె ప్రాంతానికి ఓలాలో రైడ్ బుక్‌ చేసుకున్నాడు. డ్రైవర్‌కు ఓటీపీ చెప్పి ప్రయాణం మొదలుపెట్టాడు. బుక్‌ చేసుకున్న సమయంలో రైడ్‌ ధర రూ.730 చూపించింది. గమ్య స్థానం చేరుకోగానే రైడ్‌ ధర రూ.5194 అయిందంటూ డ్రైవర్‌ తన ఫోన్‌లో చూపించాడు. దాన్ని చూడగానే సదరు విద్యార్థి కంగుతిన్నాడు. వెంటనే తన ఫోన్‌లో చెక్‌ చేస్తే రైడ్‌ క్యాన్సిల్ అయినట్లు చూపించింది. క్యాన్సిల్‌ అయిన రైడ్‌కు అంత డబ్బులు ఎలా వసూలు చేస్తారని డ్రైవర్‌ని నిలదీశాడు.

అమెజాన్‌, మెటా బాటలో ebay.. వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు

‘నా రైడ్‌ క్యాన్సిల్‌ అయినట్లు చూపిస్తోంది. డ్రైవరేమో రూ.5194 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. బెంగళూరు మొత్తం తిరిగినా ఇంత ఖర్చు కాదనకుంటా’ అంటూ రైడ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సామాజిక మాధ్యమం  ద్వారా కస్టమర్‌ సపోర్ట్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే ఓలా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అసలే కొత్త ప్రాంతం, భాష కూడా తెలియకపోవడంతో పక్కనే ఉన్న వారి సాయం తీసుకొని డ్రైవర్‌తో చర్చించాడు. చివరకు రూ.5,194లో సగం డబ్బులు కట్టండంటూ డ్రైవర్‌ చెప్పాడు. ఇక చేసేదేమీలేక సింగ్‌ రూ.1,600 చెల్లించాల్సి వచ్చింది. తన ఫిర్యాదుకు ఓలా నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంపై సింగ్‌ అసహనం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని