క్లెయిమ్ విషయంలో ఆలస్యం తగదు

కారు లేదా బైక్ ప్రమాదానికి గురైన తరువాత ఎంత సమయంలోగా బీమాను క్లెయిమ్ చేసుకోవాలి?

Published : 26 Dec 2020 13:08 IST

ప్రమాదమనేది చిన్నదైనా, పెద్దదైనా చాలా విషాదాన్ని మిగులుస్తుంది. చిన్న ప్రమాదం జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగితే ఖచ్చితంగా వైద్యం, పోలీస్ ఎఫ్ఐఆర్, వాహన మరమ్మతులు వంటివి చేయించవలసి ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో మీరు షాక్ కి గురవచ్చు. అలాంటప్పుడు మేము అందించే కొంత సమాచారం ప్రమాదం జరిగిన తరవాత బీమా క్లెయిమ్ చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. మోటార్ బీమా (కారు, బైక్) చట్టాల ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత బీమా క్లెయిమ్ చేసుకోవడంలో ఎక్కువ ఆలస్యం చేయకూడదు. అందువలన మీకు చెప్పదలుచుకున్నదేమిటంటే సాధ్యమైనంత వరకు ప్రమాదం జరిగిన కొద్దీ సమయంలోనే బీమా క్లెయిమ్ కు దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే వీలైనంత త్వరగా మీ బీమా సంస్థను సంప్రదించండి. బైక్ ప్రమాదంతో పోల్చితే కారు ప్రమాదం జరిగిన తరువాత క్లెయిమ్ కు దరఖాస్తు చేసుకోడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. అందువల్ల కారు ప్రమాదం జరిగితే వీలైనంత త్వరగా బీమాను క్లెయిమ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆలస్యమైతే అందుకు తగిన కారణాలను రుజువులతో సహా బీమా సంస్థ వారికి తెలియచేయాల్సి ఉంటుంది.

చాలా బీమా పాలసీలలో ప్రమాదం జరిగిన తరువాత ఇంత సమయంలోగా బీమాను క్లెయిమ్ చేసుకోవాలని తెలుపలేదు. అలాగే పాలసీల్లో వెంటనే లేదా సాధ్యమైనంత తొందరగా క్లెయిమ్ చేసుకోవాలని సూచించారే తప్ప నిర్దిష్ట సమయాన్ని పొందుపరచలేదు.

ఒకవేళ ప్రమాదం జరిగిన తరువాత మీరు సాధ్యమైనంత తొందరగా బీమాను క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతుందో ఒకసారి చూద్దాం.

ఉదాహరణకు మీరు కారు లేదా బైకు ప్రమాదానికి గురయ్యారని అనుకుందాం. అలాగే మీ వద్ద పోలీసు రిపోర్ట్ లేదు. ఒకవేళ పోలీసు రిపోర్ట్ లేనట్లయితే మీరు బీమా క్లెయిమ్ కు దరఖాస్తు చేయడం కొంత ఆలస్యమవుతుంది. అప్పుడు బీమా సంస్థ మీ క్లెయిమ్ కు సంబంధించి పరిశోధన చేస్తారు. ఆ ప్రమాదంలో ఇంకా ఏమైనా ఇతర సంఘటనలు జరిగితే వాటి ఆధారంగా బీమా సంస్థ క్లెయిమ్ జారీ చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని