Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై క్రిసిల్‌ నివేదిక

రానున్న 7 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి సగటున 6.70% వృద్ధిని నమోదు చేస్తుందని క్రిసిల్‌ తన తాజా నివేదికలో తెలిపింది.

Published : 03 Feb 2024 18:46 IST

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2024-2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 6.70% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని క్రిసిల్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇది మహమ్మారి (కొవిడ్‌) ముందు నాటి సగటు 6.60% కంటే ఎక్కువ. రాష్ట్రాలు తమ సొంత పెట్టుబడి ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు వడ్డీ రహిత రుణాలను అందించడానికి ప్రభుత్వం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచిందని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 2023లో ద్రవ్యోల్బణం ౫.౭0 శాతం నమోదవ్వడానికి కారణం కూరగాయలు, ఇతర ఆహార ధరలు అని కూడా ఈ నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని