D Mart: అదరగొట్టిన డీమార్ట్‌.. క్యూ1లో ఆదాయం డబుల్‌

D-Mart Q1 revenue: డీమార్ట్‌ (D-Mart) పేరిట రిటైల్‌ సూపర్‌ మార్కెట్లు నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ అదరగొట్టింది.

Published : 02 Jul 2022 20:38 IST

దిల్లీ: డీమార్ట్‌ (D-Mart) పేరిట రిటైల్‌ సూపర్‌ మార్కెట్లు నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.9,806.89 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.5,031.75 కోట్లు. గతేడాదితో పోల్చినప్పుడు ఆదాయం దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ విషయాన్ని అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ బీఎస్‌ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

2020-21 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం స్టాండలోన్‌ పద్ధతిన రూ.3,833.23 కోట్లు కాగా.. కరోనాకు ముందు ఏడాది (2019-20) ఇదే త్రైమాసికంలో రూ.5,780.53 కోట్లుగా ఉంది. రాధాకృష్ణ దమానీ, ఆయన కుటుంబం డీమార్ట్‌ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఎన్సీఆర్‌ దిల్లీ, తమిళనాడు, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జూన్‌ 30 నాటికి 294 స్టోర్లు ఉన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని