Excitel Broadband: బ్రాండ్‌బ్యాండ్‌ ప్లాన్‌తో పాటు టీవీ, ప్రొజెక్టర్‌.. ఎక్సైటల్‌ ఆఫర్‌!

Excitel Broadband: ఎక్సైటెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ కొత్తగా రెండు ప్లాన్లు తీసుకొచ్చింది. ఈ ప్లాన్లలో ఇంటర్నెట్‌, ఓటీటీతో పాటు టీవీ, ప్రొజెక్టర్‌ను సైతం ఉచితంగా పొందొచ్చు.

Published : 05 Sep 2023 16:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ (Broadband) అంటే కేవలం ఇంటర్నెట్‌ మాత్రమే. పెరిగిన పోటీ నేపథ్యంలో ఇంటర్నెట్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను సైతం అందిస్తున్నాయి. ఈ విషయంలో బ్రాండ్‌బ్యాండ్‌ సంస్థ ఎక్సైటెల్‌ (Excitel) మరో అడుగు ముందుకేసింది. తన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లతో పాటు టీవీ, ప్రొజెక్టర్‌ను సైతం అందిస్తోంది. ఇందుకోసం తాజాగా బిగ్‌స్క్రీన్‌, మినీ హోమ్‌ థియేటర్‌ పేరిట ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌, ఫ్రీ టీవీ ఛానళ్లు, ఉచిత స్మార్ట్‌టీవీ లేదా హెచ్‌డీ ప్రొజెక్టర్‌ లభిస్తుంది. దేశవ్యాప్తంగా 35 నగరాల్లో ఈ ప్లాన్లను ఎక్సైటెల్‌ తీసుకొచ్చింది. వీటి ధరలను రూ.1299, రూ.1499గా కంపెనీ పేర్కొంది.

ఎక్సైటెల్‌ తీసుకొచ్చిన రూ.1299 ప్లాన్‌లో 400 ఎంపీబీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ లభిస్తుంది. మొత్తం 16 ఓటీటీలు (డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5) వీక్షించొచ్చు. దీంతో పాటు 550 పైగా లైవ్‌ టీవీ ఛానళ్లు లభిస్తాయి. దీంతో పాటు ఉచితంగా వైబోర్‌ 32 అంగుళాల టీవీని ఇస్తారు. ఇక రూ.1499 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌లోనూ 400 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌, 16 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌, 550 లైవ్‌ టీవీ ఛానల్స్‌ లభిస్తాయి. దీంతో పాటు ఇ-గేట్‌ కె9 ప్రో మ్యాక్స్‌ ఆండ్రాయిడ్‌ ప్రొజెక్టర్‌ లభిస్తుంది. ఈ రెండు ప్లాన్ల కొనుగోలుకు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉందని కంపెనీ పేర్కొంది.

iPhone 15: ప్రపంచంతో పాటే భారత్‌లోనూ ఐఫోన్‌ 15 అన్‌బాక్స్‌?

తొలుత టీవీ ప్లాన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో దిల్లీలో పైలట్‌ ప్లాన్‌ కింద ఎక్సైటెల్‌ లాంచ్‌ చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.  స్మార్ట్‌టీవీ, ప్రొజెక్టర్‌ పొందాలంటే ముందుగా ఈ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్‌ అవ్వాలి. అలాగే మొదటి నెలా బిల్లు పే చేయాలి. ఆ తర్వాత 7-10 రోజుల్లో టీవీ/ ప్రొజెక్టర్‌ ఇంటికి చేరుతుంది. కొత్త వినియోగదారులతో పాటు, ఇప్పటికే ఉన్న ఎక్సైటెల్‌ వినియోగదారులూ ఈ ప్లాన్‌లో చేరొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని